»   » చావుకు భయ పడను: జూ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

చావుకు భయ పడను: జూ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పుట్టిన ప్రతి మనిషి ఎప్పటికైనా మరణానికి చేరువ కావాల్సిందే. అయితే మరణం విషయంలో ఇటీవల జూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అందరూ విస్తుపోయేలా ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ 2009లో జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకున్నారు.

దీని గురించి ఆయన మాట్లాడుతూ...2009 మార్చి 26న జరిగిన యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. దాన్నినేను నా రెండో పుట్టినరోజుగా భావిస్తాను. మార్చి 26 నా భార్య లక్ష్మీప్రణతి బర్త్ డే కావడంతో మార్చి 26 అంటే తమ ఇంట్లో రెండు పుట్టిన రోజులు జరుగుతాయని వెల్లడించాడు ఎన్టీఆర్.

నేను చావుకు భయపడే వ్యక్తిని కాదు. ఒక వేళ చావు నా వద్దకు వస్తే సంతోషంగా వెళ్లిపోతాను. మా అమ్మ పడుకునేటపుడు పొద్దున ఏం టిఫిన్ చేయాలని అడుగుతుంటుంది. నేనేమో ‘పొద్దున లేవాలి కదా అమ్మా. ఎవరికి తెలుసు. ఇదే చివరి నిద్రేమో అంటుంటా. నా ఆలోచనలు ఇలానే ఉంటాయంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

Jr NTR about death

ఆశ అనే చిన్న రేఖపై మనం బతుకుతున్నాం. ఏమో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నా కోరిక ఒక్కటే చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా గిల్టీగా ఫీలవకూడదు. చావూ.. వచ్చావా నన్ను తీసుకెళ్లిపో అని వెళ్లిపోవాలి. నేనిలా ఆలోచించడానికి 2009లో జరిగిన ప్రమాదమే కారణం అన్నారు.

ఆ యాక్సిడెంట్ తర్వాత జీవితాన్ని తాను చూసే కోణమే మారిపోయింది. సూర్యాపేట ఆసుపత్రికి వెళ్తుంటే నాకు జీవితమంతా కళ్లముందు కదిలింది. నా సినిమాలు, అమ్మ, అభిమానులు, నా వస్తువులు, నేను పెంచుకున్న కుక్క సహా అన్నీ గుర్తుకొచ్చాయి. చనిపోతాననే భయం లేదు కానీ...సాధించాల్సింది చాలా ఉంది అప్పుడే వెళ్లిపోతున్నామా అనిపించింది. అందరి ఆశీస్సులు ఉండబట్టే నేను ఇపుడు మీ ముందు ఉన్నాను అన్నారు.

English summary
"My desire is, I should not feel guilty before death. When death comes, I want to say, "Oh Death You Have Come!? Take Me". I should not feel that I would have done many things great if I could live for one more day. We've to life life to the fullest", said NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu