»   » అక్కడ అమితాబ్.., ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్.. రానా సినిమా కోసమే ఇదంతా

అక్కడ అమితాబ్.., ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్.. రానా సినిమా కోసమే ఇదంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానా కథానాయకుడిగా 'ఘాజీ' చిత్రం తెరకెక్కింది. సబ్ మెరైన్ కంటెంట్ తో తెలుగులో రూపొందిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ గా కనిపిస్తాడు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరిలో విడుదల వుండటంతో, త్వరలో ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచలో వున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

తెలుగు ఘాజీ ట్రయిలర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తుందని తెలుస్తుంది. తెలుగులో మంచి పట్టు, పైగా మంచి స్వరం వున్న ఎన్టీఆర్ వాయిస్ఓవర్ అన్నది పక్కా ఫిట్ అనడంలో సందేహం లేదు. ఘాజీ సినిమా ఫిబ్రవరిలో జనం ముందుకు వస్తుంది. రెండు భాషల్లోను ఈ సినిమా ట్రైలర్ ను ఒకేసారి వదలనున్నారు. హిందీ వెర్షన్ ట్రైలర్ కి అమితాబ్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలనుకుంటున్నారట. అదే విధంగా తెలుగు వెర్షన్ ట్రైలర్ కి ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ చెప్పించనున్నారట. మరి ఈ ట్రైలర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

అయితే ఇక్కడ ఇంకో స్పెషల్ న్యూస్ కూడా ఉంది ఈ సినిమా కథను పరిచయం చేస్తూ వచ్చే వాయిస్ ఓవర్ని వెంకటేష్ చెప్పనున్నారట. ప్రారంభంలోనే వచ్చే ఆ వాయిస్ ఓవర్కి చాలా ప్రాముఖ్యత ఉందని, కొంచెం సంక్లిష్టంగా ఉండే 'ఘాజీ' కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్ళడం కోసం ఆ వాయిస్ ఓవర్లో కాస్త ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుందని భావించాడట డైరెక్టర్. ఆ వాయిస్ ఓవర్ కూడా ఎవరైనా ప్రముఖ నటులతో చెప్పిస్తే బాగుంటుందని అనుకున్నారు.

Junior ntr voice for Rana ghazi ?

వెంకటేష్ చేత ఆ వాయిస్ ఓవర్ చెప్పిస్తే కథకు ఉపయోగపడడంతో పాటు సినిమాకు మంచి క్రేజ్ కూడా వస్తుందని భావించి ఫైనల్గా వెంకటేష్ చేత చెప్పించాలని ఫిక్స్ అయింది ఘాజీ యూనిట్. సంకల్ప్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

1971లో ఇండియా-పాకిస్తాన్ యుధ్ధ సమయంలో... విశాఖపట్నాన్ని ధ్వంసం చేయాలన్న టార్గెట్తో బోర్డర్ దాటి వచ్చిన 'ఘాజీ' అనే పాకిస్తాన్ సబ్మెరైన్ని మన నావికాదళానికి చెందిన సైనికులు ఎంత వీరోచితంగా పోరాడి ధ్వంసం చేశారన్న కథతో 'ఘాజీ' సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ స్టేజ్లో ఉంది. తాప్సీ హీరోయిన్ గా కనిపించటం విశేషం.

English summary
Latest news about Rana ghazi... Junior NTR giving Voice over for Rana's Latest movie Ghazi Trailer
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu