»   » కార్తి ‘కాష్మోరా’ ఆడియన్స్ టాక్.... ప్లస్, మైనస్ పాయింట్స్!

కార్తి ‘కాష్మోరా’ ఆడియన్స్ టాక్.... ప్లస్, మైనస్ పాయింట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో కార్తి ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన చిత్రం 'కాష్మోరా'. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, శ్రీదివ్య హీరో హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

హారర్, కామెడీ ఎలిమెంట్స్ కు ఫాంటసీ జోడించిన తెరకెక్కించారు. దాదాపు 500 సంవత్సరాల క్రితం జరిగిన సంగనలు... ఇప్పటి కాలానికి కనెక్టయ్యేలా కథను రూపొందించారు. ఫ్లాష్ బ్యాక్ లో కార్తి రాజ్ నాయక్ పాత్రలో డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. రాజ్ నాయక్ పాత్రకు జోడీగా నయనతార నటించింది.

సినిమా చూసిన అనంతరం ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏమిటి? మైనస్ పాయింట్స్ ఏమిటి? అనే దానిపై ఓ లుక్కేద్దాం.

కాన్సెప్టు, కార్తి అదుర్స్

కాన్సెప్టు, కార్తి అదుర్స్

రొటీన్ హారర్, కామెడీ లా కాకుండా...దానికి 500 సంవత్సరాల క్రితం నాటి పిరియాడిక్ కాన్సెప్టును జోడించి ఇప్పటి పరస్థితులకు కనెక్ట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. రెండు పాత్రల్లోనూ కార్తి అదరగొట్టాడు.

కామెడీ సూపర్బ్

కామెడీ సూపర్బ్

కాష్మోరా పాత్రలో కామెడీ బాగా పండించాడు. అదే సమయంలో రాజ్ నాయక్ పాత్రలో లుక్స్ పరంగా అభిమానులను, ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసారు.

హారర్, కామెడీ, ఫాంటసీ

హారర్, కామెడీ, ఫాంటసీ

సినిమాలో హారర్, కామెడీ, పాంటసీ ఈ మూడు బాగా సింక్ అయ్యేలా దర్శకుడు స్క్రిప్టు రాసుకున్నాడు. ప్రేక్షకులను ఈ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి.

గ్రాఫిక్స్

గ్రాఫిక్స్

గ్రాఫిక్స్ వర్క్ చాలా బావుంది. అభిమానులకు సరికొత్త అనుభూతి కలిగిస్తాయి. సెకండాఫ్ లో నయనతార, కార్తి మధ్య వచ్చే కొన్ని మూమెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.

మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే సినిమా బాగా లెంత్ గా ఉండటమే. క్లైమాక్స్ లో ఫాంటసీ ఎంలిమెంట్స్ కాస్త ఓవర్ గా అనిపిస్తాయి. ఫాంటసీలో రాజ్ నాయక్ క్యారెక్టర్, అప్పుడే జరిగే సంఘటనలు కొన్ని ఇంట్రెస్టింగ్ గా లేవు.

English summary
Karthi's Kaashmora is a multi-genre film directed by Gokul. The SR Prabhu-produced movie has Nayanthara and Sri Divya playing the female leads. Vivek, Sharath Lohitashwa, Madhusudhan Rao and many others are also in the cast. Karthi plays a triple role in the movie of which two characters (self-obsessed warlord named Raj Nayak and a black magician) have been revealed. The third role has been kept as a surprise for the audience. Nayanthara has enacted the role of princess Nayanthara and Sri Divya will be seen as a PhD student, who is doing a research on sorcery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu