»   » కాజల్ తెలివిని చూసి షాక్

కాజల్ తెలివిని చూసి షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాజల్ అగర్వాల్ చాలా తెలివిగా పావులు కదుపుతోంది. ఇటు తెలుగు, అటు తమిళం, మరో ప్రక్క హిందీ ఇలా మూడు భాషల్లోనూ తన స్దానాన్ని పదిలం చేసుకోవటానికి సిద్దపడుతోంది. హిందీలో సింగం చిత్రంతో అడుగుపెట్టిన ఆమె అక్కడ ఇంటర్వూల్లో తనకు హిందీ నటి కాజల్ ఆదర్శమని స్టేట్మెంట్ లు ఇచ్చి అజయ్ దేవగన్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అజయ్ భార్య కాజల్ కావటంలో ఈ స్టాటజీ ప్లే చేస్తోంది. అజయ్ కి బాలీవుడ్ లో ఉన్న పరిచయాలతో అక్కడ మెల్లిగా సెటిలవ్వాలని ప్రయత్నిస్తోంది.

ఇక మరో ప్రక్క తమిళ నటుడు సూర్య గురించి తమిళ మీడియాలో హోరెత్తిపోయాలా మొన్నీ మధ్య మాట్లాడింది. దాంతో అక్కడివారు ఆమెను తమ సినిమాల్లో బుక్ చేసుకోవాలని తహతహలాడుతున్నారు. తెలుగు విషయానికి వస్తే ఆమె ప్రభాస్ వంటి స్టార్ హీరోలతోనూ, రామ్ చరణ్ వంటి మెగా హీరోలతోనూ స్పెషల్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తోంది. ఆమె స్పీడు, నడవడిక చూసి దర్శక, నిర్మాతలు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె మహేష్ సరసన ది బిజెనెస్ మెన్ లో ఆపర్ సంపాదించి తన తోటి హీరోయిన్స్ కి సవాల్ విసిరింది. ఈ వారంలోనే ఆమె నటించిన దడ చిత్రం విడుదల కాబోతోంది.

English summary
Kajal Agarwal is a clever young girl who is very ambitious and goes about her career with the astuteness of a professional chess player.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu