»   » నామీద కుట్ర జరుగుతోంది, అవన్నీ అబద్దాలే: మండిపడ్డ కాజల్

నామీద కుట్ర జరుగుతోంది, అవన్నీ అబద్దాలే: మండిపడ్డ కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్, కోలీవుడ్ లలో అందాల నటి కాజల్ చాలా బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేనప్పటికీ, ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్ప్టికిప్పుడు రానా తో కలిసి చేస్తున్న నేనే రాజు నేనే మంత్రి తప్ప గట్టి ఆఫరేం లేదు కాజల్ చేతిలో అయితే ఈమధ్యే ఒక కొత్త రూమర్ తో పాపులర్ అయ్యింది కాజల్.

ముక్కు సర్జరీ

ముక్కు సర్జరీ

అవకాశాలు తగ్గుతోన్న క్రమంలో తాను మరింత అందంగా కనిపించవలసిన అవసరాన్ని గుర్తించిన కాజల్, సర్జరీ ద్వారా తన ముక్కుతీరు మార్చుకుందని అంటున్నారు. గతంలో ఆమె ఫోటోలు .. ఇప్పటి ఫోటోలు చూస్తుంటే తేడా స్పష్టంగా తెలుస్తోందంటూ నెటిజన్లు చెబుతున్నారు.

Kajal Agarwal Is Going To Act With Nagarjuna In Raju Gari Gadi-2 | Filmibeat Telugu
టాలీవుడ్ హీరో తో డేటింగ్

టాలీవుడ్ హీరో తో డేటింగ్

అంతే కాదు తాజాగా ఒక టాలీవుడ్ హీరో తో డేటింగ్ లో ఉందంటూ వచ్చిన మరో రూమర్ కూడా కాజల్ కి చిరాకు గానే ఉందట. మరీ ఆధారం లేని ఇలాంటి వార్తలకు చెక్ చెప్పాలనుకుందో ఏమో గానీ తాజా ఇంటర్వ్యూలో కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చింది కాజల్.

ప్రేమ వివాహమే చేసుకుంటా

ప్రేమ వివాహమే చేసుకుంటా

ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడిన కాజల్‌.. తను ప్రేమ వివాహమే చేసుకుంటానని, తనకు కాబోయే వాడు సినీరంగానికి చెందినవాడైనా ఫర్వాలేదని, అతను అందంగా ఉన్నా లేకపోయినా, అరడుగుల పొడవు ఉండాలని చెప్పింది. దీంతో ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరోతో కాజల్‌ ప్రేమలో ఉందని, అతణ్ని రహస్యంగా కలుస్తోందని కూడా గ్యాసిప్‌లు పుట్టుకొచ్చేశాయి.

దుష్ప్రచారం చేస్తున్నారు.

దుష్ప్రచారం చేస్తున్నారు.

అలాగే సినిమాలో అవకాశాల కోసం ఈ అమ్మడు తాజాగా తన ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకుందని వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది కాజల్‌. ‘ఇటీవలి కాలంలో నాపై వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయి. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు.

నాపై పన్నుతున్న కుట్ర

నాపై పన్నుతున్న కుట్ర

ఇదంతా వారు నాపై పన్నుతున్న కుట్ర. అయినా నేను వెనక్కి తగ్గను. తెలుగు,తమిళ అగ్రహీరోల సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నన్నేం చేయలేర'ని చెప్పింది. ఇలా చెప్పటం వరకూ బాగానే ఉంది గానీ ఆ ముక్కులో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ మార్పెలా వచ్చిందో మాత్రం చెప్పనే లేదు కాజల్

English summary
Kajal Aggarwal Gracefully answered plastic surgery rumor about her, and her Dating with Tollywood star hero
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu