»   » కాజల్ ప్యారిస్ ట్రిప్ సీక్రెట్

కాజల్ ప్యారిస్ ట్రిప్ సీక్రెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో దాదాపు టాప్ స్ధాయికి చేరుకున్న హాట్ హీరోయిన్ కాజల్ త్వరలో ప్యారిస్ వెళ్ళనుంది.అయితే ఈ ట్రిప్ షూటింగ్ కోసం కాదట...విశ్రాంతి కోసమని చెప్తోంది.ఆమె మాట్లాడుతూ...''వరుస సినిమాలతో అలసిపోయాను. నాలుగేళ్లలో 21 సినిమాల్లో నటించాను. ఎక్కడా విరామం తీసుకోలేదు. మనసు, శరీరం కాస్త విశ్రాంతి కోరుకొంటున్నాయి. అందుకే నా స్నేహితులతో కలిసి పారిస్‌ వెళ్తున్నాను. ఒక వారం అక్కడ ఆనందంగా గడిపి మరో ఏడాది షూటింగ్ లలో పాల్గొనడానికి అవసరమైన శక్తిని నింపుకొని వస్తాను అంది.

అలాగే ఇటీవల నేను నటించిన 'సింగమ్‌' సినిమా బాలీవుడ్‌లో మంచి పేరు తీసుకొచ్చింది. హిందీ అవకాశాలు చాలానే వస్తున్నాయిగానీ ప్రస్తుతానికి ఏవీ ఒప్పుకోలేదు. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు సరసన 'ది బిజినెస్‌ మేన్‌' చిత్రాన్ని అంగీకరించాను. 'సింగం'తో విజయాన్ని అందుకొన్న తరవాత విహార యాత్రకు వెళ్లడం మరింత ఆనందాన్నిస్తోంది'' అని చెప్పుకొచ్చింది.ఇక ఆమె రీసెంట్ చిత్రం దడ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఆమె నటించిన వీర,సింగం చిత్రాలు కూడా ఊహించినంతంగా ఆడలేదు.

English summary
Kajal has worked in over 21 films down south in a short span of four years. She has been shooting back to back for her Telugu and Tamil projects and has also been very busy with Singham. Now she has gone for a vacation to Paris and Nice with her friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu