»   » వెంకటేష్ సరసన కమిలినీ ముఖర్జీ

వెంకటేష్ సరసన కమిలినీ ముఖర్జీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ తాజా చిత్రం ఆప్త రక్షక రీమేక్ లో కమిలినీ ముఖర్జీ ఎంపికయినట్లు సమాచారం. పి.వాసు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అనూష్క మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. అనూష్క రేటు ఎక్కువ చెప్పిందని అనూష్క శర్మను ట్రై చేస్తే ఆమె డేట్స్ ఖాళీలేవని తెలిసింది. దాంతో తిరిగి అనూష్కనే అవకాశం వరించింది. ఇక శ్రధ్దాదాస్, రిచా గంపోపాద్యాయ, పూనం కౌర్ లు కూడ వెంకటేష్ ప్రక్కన చేయనున్నారు. మరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేయాలని చూస్తున్నారు. ప్రియమణి ఆ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇక ఆనంద్ తో తెలుగు తెరకు పరిచయమైన కమిలినీ ముఖర్జీ ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్ లలో చేసింది. అలాగే హాస్య చిత్రం బ్రహ్మానందం డ్రామా కంపెనీలో కూడా కీలకమైన పాత్ర చేసింది. అలాగే గమ్యంలో ఆమె చేసిన పాత్ర ఆమెకు పేరు తేవటమే కాకుండా ఇతర భాషల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెంకటేష్ తో చేయటం మాత్రం ఇదే తొలిసారి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu