twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండె పోటుతో యువ హీరో హేమంత్ మృతి

    By Bojja Kumar
    |

    బెంగుళూరు : కన్నడ చిత్రసీమకు చెందిన యువ నటుడు హేమంత ఈ రోజు ఉదయం గుండె పోటుతో మరణించాడు. 27 సంవత్సరాల వయసుగల హేమంత జిమ్‌లో వ్యాయాయం చేస్తుండగా గుండె పోటు సంభవించింది. వెంటనే అతన్ని బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి నిన్నసాయంత్రం తరలించారు.

    అయితే ట్రీట్‌మెంట్ ఫెయిల్ కావడంతో ఈ రోజు తెల్లవారు ఝామున 3.15 గంటలకు మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. ఈ సంవత్సరం మార్చిలో హేమంత్ నటించిన చివరి చిత్రం'నేనపినంగల' విడుదలైంది. ఈ చిత్రంలో నటనకుగాను హేమంత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

    హేమంత్ హఠాన్మరణంతో కన్నడ చిత్ర సీమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన కోస్టార్స్, అభిమానులు, పరిశ్రమలో పలువురు సినీ ప్రముఖులు హేమంత్ మరణ వార్త విని షాకయ్యారు. పలువురు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఆయన మృతికి సంతాపం తెలిపారు.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో..

    సంతాపం తెలిపిన సుదీప్

    కిచ్చా సుదీప్(ఈగ ఫేం) హేమంత్ మరణవార్త విని షాకయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆయన మృతికి సంతాపం తెలిపారు.

    సుదీప్ ట్వీట్స్...

    హేమంత్ మరణ వార్త గురించి సుదీప్ తన ట్విట్టర్లో పేర్కొంటూ...‘బుధవారం ఉదయం 3.15 గంటలకు ‘నేనపినంగల' నటుడు హేమంత్ గుండె పోటుతో మరణించాడు. ఆయన వయసు 27 మాత్రమే. అతి చిన్న వయసులోనే మరణించడం బాధాకరం' అని ట్వీట్ చేసారు.

    సుదీప్ ఆయన గురించి మరిన్న వివరాలు వెల్లడిస్తూ..


    ‘హేమంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన బహుమతి లాంటిది' అని వ్యాఖ్యానించారు.

    హార్ట్ ఎటాక్‌తో మరణించిన హేమంత్


    జిమ్ చేస్తుండగా హేమంత్ గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయినా ఆయన ప్రాణాలు దక్కలేదు.

    ‘నేనపినంగల' చిత్రంలో హేమంత్


    ఇక్కడ కనిపిస్తున్న హేమంత్ చిత్రం ‘నేనపినంగల' చిత్రంలోనిది.

    మార్చిలో విడుదలై చివరి సినిమా...


    ఈ సంవత్సరం మార్చిలో హేమంత్ నటించిన చివరి చిత్రం‘నేనపినంగల' విడుదలైంది

    English summary
    Young actor Hemanth died of heart attack in the wee hours of Wednesday (July 3). He was 27 and his last movie was Nenapinangala, which was released in March 2013. Reports say that he suffered a heart attack while doing workouts in his gym in Hebbal, Bangalore. As he complained of chest pain, he was rushed to MS Ramaiah hospital last evening. But treatment failed and he breathed his last around 3.15 am.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X