»   »  చెక్ బౌన్స్ కేసులో అరెస్టు- విడుదల

చెక్ బౌన్స్ కేసులో అరెస్టు- విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: ఈ మధ్య కాలంలో చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యే ఆర్టిస్టులు, సినిమావాళ్లు ఎక్కువ అవుతున్నారు. రీసెంట్ గా తమిళదర్శకుడు చేరన్ ఈ కేసులో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మధ్యకాలంలో తెలుగు నుంచి జీవితరాజశేఖర్ కూడా ఇదే తరహా కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు మరో ఆర్టిస్టు ఇదే సీన్ రిపీట్ అవుతోంది.

చెక్కు బౌన్సు కేసుకు సంబంధించి పలుమార్లు విచారణకు గైర్హాజరు అవుతున్న నటుడు మయూర్‌ పటేల్‌ను హలసూరు ఠాణా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆయన్ను సివిల్‌ కోర్టు ముందు హాజరు పరచగా, జామీనుపై విడుదలయ్యారు.

Kannada Actor Mayur Patel Booked For A Bounced Cheque in Doddaballapura

వివరాల్లోకి వెళితే గౌరిబిదనూరుకు చెందిన సెల్వకుమార్‌ అనే వ్యక్తికి మయూర్‌ పటేల్‌ ఇచ్చిన రూ.5 లక్షల చెక్కు పలుమార్లు వెనక్కు వచ్చింది. దీంతో ఆయన సివిల్‌ కోర్టులో దావా వేశారు. దొడ్డబళ్లాపుర ఠాణాలో ఒక కేసు కూడా వేశారు. విచారణకు గైర్హాజరవుతున్న కారణంగా ఆయనపై న్యాయమూర్తి అరెస్టు వారెంటును జారీ చేశారు.

English summary
FIR and Cheating case is charged against Kannada Actor Mayur Patel of 'Mani' fame based on the complaint lodged by Selva kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu