»   » చేసిన తప్పులు చెప్తా... : F.M లో సీనియర్ హీరో

చేసిన తప్పులు చెప్తా... : F.M లో సీనియర్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ఇన్నాళ్లూ దర్శకుడు, నిర్మాత, సమర్పకుడు, సంగీత దర్శకుడిగా కన్నడ చలన చిత్ర రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకొన్న క్రేజీ స్టార్‌ రవిచంద్రన్‌ రేడియో త్వరలో జాకీ (ఆర్‌జె)గా సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఈ కొత్త పాత్ర సినిమాల్లో మాదిరిగా నటించటం కాకుండా తన 50 ఏళ్ల జీవన పయనంలో ఎదురైన తీపి, చేదు అనుభవాల్ని శ్రోతలతో పంచుకొనేందుకుయత్నిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వివరాల్లోకి వెళితే.....

92.7 బిగ్‌ ఎఫ్‌.ఎం.లో 'రవిచంద్రన్‌తో నేర హిట్స్‌' అనే శీర్షికన తాను చేయబోయే కొత్త పాత్రపై ఆయన నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇలా చెప్పుకొచ్చారు. 'నేను ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించా. ఈ ఆర్‌జెగా తన జీవితంలోని అనుభవాల్ని శ్రోతలతో పంచుకొంటున్నా. నేను ఎవ్వరికీ సందేశాలు ఇవ్వబోను. నా అనుభవాలతో కొందరైనా స్ఫూర్తి పొందితే చాలు. ఇప్పటికే నేను చాలా మాధ్యమాల్లో జీవన విశేషాలు వివరించా.

Kannada hero Ravichandran Turns RJ

తెలియక ఎన్నో తప్పిదాలు చేసి ఉండవచ్చు. ఈ తప్పుల్ని నేను ఈ కార్యక్రమం ద్వారా వెల్లడించబోతున్నా. డబ్బే ప్రధానం కాకుండా వ్యక్తిగతంగా ఈ కొత్త పాత్రలో జీవించాలని భావిస్తున్నా'నని వివరించారు. ఆరు నెలల పాటు ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటల నుంచి 10 వరకు రవిచంద్రన్‌ ఈ కార్యక్రమంలో శ్రోతలతో ముచ్చటించబోతున్నట్లు సంస్థ దక్షిణ విభాగాధిపతి దివ్యశ్రీ నాగరాజు ఈ సందర్భంగా చెప్పారు.

అలాగే...ఆయన్ను... ఇష్టమైన హీరోయిన్‌ ఎవరని ప్రశ్నించగా.. వాస్తవం చెబితే కష్టం. ఆమెకు వివాహమై భర్త, పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటూ ఉంటుంది. ఆమెను ఎందుకు ఇబ్బందిపెట్టాలి. అందుకే నా భార్యే నా హీరోయిన్‌ అంటున్నాడు ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన్.

అలాగే...పొట్ట బాగా పెరిగింది. సిక్స్‌ప్యాక్‌తో సినిమా తీస్తారా? అని ఓ అభిమాని అడుగగా.. ..అదేం పెద్ద కష్టం కాదు. సిక్స్‌ప్యాక్‌ కాదు ఏకంగా ఎయిట్‌ ప్యాక్‌ అయినా చేయచ్చు. గ్రాఫిక్స్‌ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది అని చెప్పి నవ్వించారు.

తండ్రి పాత్రల్ని చేస్తున్నారు. దీన్నే కొనసాగిస్తారా? ఆయన స్పందిస్తూ..... వయస్సు మీరిందని అనుకోవద్దు. సుదీప్‌ కోరాడు కాబట్టి తండ్రిపాత్రను అంగీకరించాను. పాతికేళ్ల కింద అడిగినా సంతోషంగా నటించేవాడిని. ఎలాంటి పాత్రల్నైనా చేస్తా. ప్రేమికుడి పాత్రలైనా ఓకే. ఏం చేయాలేనా? అన్నారు.

English summary
Crazy Star Ravichandran is delighted to be part of the BIG FM programme. "I’m sure that our work together will entertain listeners as much as it would help them overcome their problems," he has said.
Please Wait while comments are loading...