»   » పవన్ అంటే పిచ్చి: దుమ్ము రేపుతున్న పాట... అప్పుడే లక్షల్లో!

పవన్ అంటే పిచ్చి: దుమ్ము రేపుతున్న పాట... అప్పుడే లక్షల్లో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంత పిచ్చిగా ఎదురు చూస్తుంటారో మరోసారి రుజువైంది. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని కాటమరాయుడు పాటను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయగా...కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.

పవన్ కళ్యాణ్‌ మేనేజర్, నిర్మాత మోసం: నైజాం డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన!

యావరేజ్ గా సెకనుకు వెయ్యి హిట్స్ చొప్పిన.... కౌంట్ వేగంగా పెరిగిపోతోంది. తొలి మూడు గంటల్లోనే 5 వ్యూస్ వచ్చాయి. ఈ స్పీడు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ యూట్యూబ్ వ్యూస్ సొంతం చేసుకున్న సాంగుగా రికార్డులకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Katamarayudu

'మిరా మిరా మీసం... మెలితిప్పుతాడు జనం కోసం' అంటూ సాగే ఈ పాట అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. యూట్యూబ్ లో లిరిక్స్ తో పాటు ఈ పాటను రిలీజ్ చేయడం కూడా అభిమానులను మరింత అట్రాక్ట్ చేస్తోంది.

నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మాణంలో గోపాల గోపాల ఫేం డాలీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఒక్కోపాట ఇలా నేరుగా విడుదల చేసి మార్చి 12న ప్రీరిలీజ్ ఈవెంటు నిర్వహించే అవకాశం ఇంది. మార్చి 24న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తేన్నారు.

English summary
Katamarayudu "Mira Mira Meesam" song got super response. The song reached 5 lakhs youtube views in just 3 hours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu