»   » ‘కాటమరాయుడు’ మూవీ ఆడియన్స్ రివ్యూ

‘కాటమరాయుడు’ మూవీ ఆడియన్స్ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు కిషోర్ కుమార్ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కిన 'కాటమరాయుడు' సినిమాకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన వారంతా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.

కాటమరాయుడు సినిమా తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన 'వీరమ్' చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే స్టోరీ అదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే, స్క్రిప్టులో మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగిన విధంగా మార్పులు చేసారు దర్శకుడు.

సినిమా స్టోరీ కాటమరాయుడు(పవన్ కళ్యాన్), అతడి నలుగురు సోదరుల చుట్టూ తిరుగుతుంది. తమ్ముళ్లే ప్రాణంగా జీవించే కాటమరాయుడు వారిని సంతోషంగా ఉంచడానికి తన సంతోషాన్ని త్యాగం చేసి జీవిస్తుంటాడు. దీంతో పాటు ఊరి వారందరికీ ప్రతి విషయంలో సహాయంగా ఉంటాడు.

అమ్మాయిలంటే డేంజర్ అనే అభిప్రాయంలో ఉండే కాటమరాయుడు పెళ్లి పెటాకులు లేకుండా అలానే ఉంటాడు. తమ్ముళ్లకు కూడా పెళ్లి లేకుండానే జీవితం చాలా సంతోషంగా ఉంటుందని ఉపదేశిస్తుంటాడు. అయితే నలుగురు తమ్ముళ్లు అన్నయ్యకు తెలియకుండా ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు. తమ పెళ్లి కావాలంటే ముందు అన్నయ్యను కూడా ప్రేమలోకి దించాలని ప్లాన్ చేస్తారు. తమ ఊరికి ఒక రీసెర్చ్ నిమిత్తం వచ్చిన అమ్మాయి(శృతి హాసన)తో అన్నయ్య ప్రేమలో పడేలా చేస్తారు. అయితే అన్నయ్య పెళ్లి జరుగాలంటే కొన్ని అడ్డంకులు ఉంటాయి. మరి అవి ఎలా క్లియర్ చేసుకున్నాడు అనేది తర్వాతి కథ.

సినిమా ఫస్టాఫ్ లో ట్రైన్ ఫైట్, పవన్ కళ్యాణ్-శృతి హాసన్ మధ్య లవ్ సీన్స్ చాలా బావున్నాయనే టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్ లో సెంటిమెంట్ సీన్స్, క్లైమక్స్ ఆకట్టుకునే విధందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా ఎలా ఉందనే విషయమై ఆడియన్స్ ట్వీట్స్....

వీరమ్ కంటే 100 శాతం బెటర్

.

యావరేజ్ గా ఉందంటూ ఒకరు ఇలా

.

పవన్ వన్ మెన్ షో

.

ఉమెర్ సంధు రేటింగ్ 4

.

అభిమానులకు ఎబో యావరేజ్

.

పర్వాలేదు

.

క్రేజీ ఫస్టాఫ్, నైస్ సెకండాఫ్

.

సూపర్ హిట్ మూవీ

.

బిగ్గెస్ట్ హిట్

.

మిస్ కావొద్దు

.

మాస్ లో పండగే

.

బ్లాక్ బస్టర్ షో

.

English summary
The audience says that Katamarayudu has a routine and predictable story, but it is the interesting script that makes the film an entertaining watch. The first half of the film is slow and dragging and some romance and comedy scenes keep the viewers engaged.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu