»   » 'కాటమరాయుడు' రిలీజ్ డేట్ ఖరారైంది

'కాటమరాయుడు' రిలీజ్ డేట్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ రీసెంట్ గా మొదలై శరవేగంతో జరుగుతున్న విషయం తెలిసిందే. కిశోర్ పార్థసాని (డాలీ)డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు . ఇక డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, వేసవి సీజన్ మొదట్లో సినిమాను విడుదల చేయాలని మొదట్నుంచీ ప్లాన్ చేసిన టీమ్, ఆ ప్రకారంగానే తాజాగా ఒక విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న కాటమరాయుడు సినిమాను విడుదల చేయనున్నట్లు టీమ్ తెలిపింది. ఇక కాటమరాయుడు మార్చికి ఫిక్స్ అయిపోవడంతో మిగతా సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయన్నది చూడాలి.


English summary
Makers of Pawan Kalyan's under-production film 'Katamarayudu' have officially announced the movie's release date as March 29, 2017, a Ugadi festival gift to movie lovers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu