»   » కథలో రాజకుమారి రిలీజ్ డేట్

కథలో రాజకుమారి రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
కథలో రాజకుమారి రిలీజ్ డేట్.."Kathalo Rajakumari" Movie Realese Date Fix |

నారా రోహిత్‌, నాగశౌర్య, నమితా ప్రమోద్‌, నందిత ప్రధాన పాత్రలలో మహేష్‌ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "కథలో రాజకుమారి". జూలైలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ 'యూ' సర్టిఫికేట్ పొందింది. అయితే కొన్ని కారణాలవల్ల రిలీజ్ కొద్దిగా ఆలస్యమయ్యింది. హిట్ అండ్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో 'నారా రోహిత్ సొసైటీ కి యూజ్ అయ్యే కథతో 'ప్రతినిధి' సినిమాలో నటించి వైవిధ్యాన్ని చూపించాడు.

కామన్ మాన్ రోల్ లో

కామన్ మాన్ రోల్ లో

తాను ఎన్నుకున్న కధల్లో బలం ఉందా లేదా అనేది మాత్రమే చూసే హీరో నారారోహిత్ ..అందుకే ఇంత తక్కువ టైం లో అన్ని సినిమాలు చేయగలిగాడు ..ప్రజా సమష్యలను ఎదుర్కొంటు ప్రశ్నించే ఒక కామన్ మాన్ రోల్ లో నటించి ప్రతినిధి సినిమా తో మెప్పించాడు రోహిత్ .'సోలో'లాంటి లవ్ స్టోరీ లో నటించి తాను అన్ని రకాల పాత్రలను చెయ్యగలను అని ప్రూవ్ చేసాడు 'నారా రోహిత్'.

నారా రోహిత్ లుక్

నారా రోహిత్ లుక్

ఇప్పుడు కూడా అతని తత్వం లో ఏమార్పూ లేదు రెగ్యులర్ రొటీన్ ఫార్ములాలో పడిపోకుండా తనకంటూ ఒక స్టైల్ ని ఎంచుకున్నాడు. గతం లో విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూడగానే లుంగీ కట్టు..గుబురు గడ్డం..చేతిలో కత్తి..నోట్లో సిగరేట్ తో అరవీరభయంకరంగా కనిపించే విధంగా ఉన్న 'నారా రోహిత్' లుక్ చూసి ఆశ్చర్యపోయారు. కాస్త వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 15వ తేదీన

ఈ నెల 15వ తేదీన

'కథలో రాజకుమారి' ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవనుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రమిది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

English summary
Kathalo Rajakumari’ has been postponed due to some unsaid reasons and finally, the movie is all set for release on 15th September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu