»   » భర్తకి విడాకులు...హీరో తో ద్వితీయ వివాహం

భర్తకి విడాకులు...హీరో తో ద్వితీయ వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ,మళయాళ హీరోయిన్ కావ్య మాధవన్ ఇటీవల తన భర్త నిషాల్ చంద్ర నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడు హీరో దిలీప్ ని వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె కేరళలోని ప్రముఖ జ్యోతిష్యుని కలిసిందని తెలుస్తోంది. ఇక కొంతకాలంగా దిలీప్,కావ్య మాధవన్ మధ్య రహస్య సంభంధం ఉందని ప్రచారం జరిదింది. అయితే కావ్య వీటిని ఖండించింది.

కానీ తన భర్త దిలీప్ కు,కావ్య కు మద్య ఉన్న రిలేషన్ ని తెలుసుకున్న దిలీప్ భార్య మంజు వారియర్ అతన్ని వదిలేసి ఒంటిరిగా ఉంటోంది. తిరిగి తన నాట్య కార్యక్రమాల్లో ఉంటోంది.మళయాళ చిత్రాల్లోనూ బిజీ అవుతోంది. ఈ నేపధ్యంలో కావ్య,దిలీప్ లు వివాహం చేసుకుని తమ జీవితం అపీషియల్ గా ప్రారంభించనున్నారని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Kavya Madhavan is ready for second marriage

గతంలో కావ్య మీడియాతో మాట్లాడుతూ..పెళ్ళయిన తర్వాత సుఖమన్నది మర్చిపోయారని, తన అత్తింటివారు,భర్త తనను పనిమనిషి కన్నా హీనంగా ట్రీట్ చేసారని వాపోయింది. అలాగే తన చేతే ఇంటి పనంతా చేయించేవారని, అది చాలదన్నట్లు రకరకాల సూటిపోటి మాటలతో టార్చర్ పెట్టేవారని అంది. ఇక తనను అనుమానించేవారని, ఆ టార్చర్ ని భరించటం కష్టమయ్యే వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అంది. ఇక కావ్య మాదవన్...కాశీ, అపరిచితన్, క్లాస్ మేట్స్ , క్రిష్టియన్ బ్రదర్శ్, తంబి దురైవంటి సూపర్ హిట్ చిత్రాల్లో చేసింది.

English summary
Kavya Madhavan was in news earlier for her divorce with Nishal Chandra. Now it is reported that Kavya is getting married again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu