»   » హీరోయిన్‌పై లైంగిక దాడి: బెయిల్ వచ్చింది, హీరో దిలీప్‌కి ఇంకో ఆనందం

హీరోయిన్‌పై లైంగిక దాడి: బెయిల్ వచ్చింది, హీరో దిలీప్‌కి ఇంకో ఆనందం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kerala High Court Grants Bail to Actor After 86 Days హీరోకి బెయిల్ వచ్చింది

మళయాల సినీనటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, సినీ నటుడు దిలీప్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కేరళ హై కోర్టు ఆమోదించింది. కొద్ది సేపటిక్రితమే నిబందనలతో కూడిన బెయిలు మంజూరు చేస్తున్నట్టు చెప్పింది కేరళ హై కోర్టు. 86 రోజుల రిమాండ్ తర్వాత ఎట్టకేలకు ఈ రోజు దిలీప్ కి బెయిల్ మంజూరయ్యింది.

 ఎనభై ఆరు రోజుల పాటు

ఎనభై ఆరు రోజుల పాటు

ఈ కోర్టులో దిలీప్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఇప్పటికి రెండుసార్లు తిరస్కరణకు గురయ్యింది. జూన్‌ 10న దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో భాగంగా అల్వా సబ్‌ జైల్‌కు తరలించారు. అయితే ఇప్పటికే ఎనభై ఆరు రోజుల పాటు కస్టడీలో వున్న నేపథ్యంలో చట్టప్రకారం బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా దిలీఫ్‌ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

నటిపై లైంగిక దాడి

నటిపై లైంగిక దాడి

కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా ప్రాసిక్యూషన్‌ కోరింది. బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తును అడ్డుకొనే ప్రమాదం ఉందని పేర్కొంది. అయినా హైకోర్టు కొన్ని నిబందనలతో కూడిన బెయిలు ఇచ్చేసింది. పిబ్రవరి 17న మళయాల నటిపై లైంగిక దాడికి సంబంధించి అతనిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

 రామలీలా

రామలీలా

ఎట్టకేలకు బెయిల్‌ లభించడంతో కాస్త ఉపశమనం పొందిన మళయాల నటుడు దిలీప్‌కు మరింత ఊరట లభించింది. ఆయన నటించిన చిత్రం రామలీలా చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. ప్రేక్షకుల మదిని కొల్లగొడుతోంది. బెంగళూరు, చెన్నైతోసహా దక్షిణాదిన విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.4.61కోట్ల వసూళ్లు రాబట్టింది. రామలీలా చిత్రం పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు అరుణ్‌ గోపి దర్శకత్వం వహించాడు.

 సెప్టెంబర్‌ 28న విడుదల

సెప్టెంబర్‌ 28న విడుదల

వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ దిలీప్‌ జైలుకు వెళ్లిన కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. అయితే, అతడు విడుదలయ్యాకే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే, దాదాపు నాలుగుసార్లు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ కూడా కోర్టు రద్దు చేయడంతో ఇక సినిమాపై ప్రభావం చూపించకుండా ఈ నెల సెప్టెంబర్‌ 28న విడుదల చేశారు. తాజాగా దిలీప్‌కు కూడా మంగళవారం బెయిల్‌ రావడంతో అతడికి రెండు శుభవార్తలు విన్నట్లయింది.

English summary
Kerala High Court grants bail to actor Dileep in abduction and assault case; relief after 86 days
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu