»   » లైంగిక దాడి: మౌనం వీడిన హీరోయిన్, సోషల్ మీడియాలో ఇలా...

లైంగిక దాడి: మౌనం వీడిన హీరోయిన్, సోషల్ మీడియాలో ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేరళలో ఇటీవల మళయాల నటి(మహాత్మ మూవీ హీరోయిన్)పై లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రెండున్నర గంటలపాటు కార్లో తిప్పుతూ ఆమెను అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డారు. ఆమె వద్ద పని చేసిన డ్రైవర్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఘటన వెనక మళయాల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

ఈ ఘటన మళయాలం చిత్రసీమనే కాదు... యావత్ ఇండియన్ సినీ లోకాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన తర్వాత తొలిసారిగా సదరు నటి మౌనాన్ని వీడియారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించారు.

 పైకి లేస్తూనే ఉంటా

పైకి లేస్తూనే ఉంటా

ఈ జీవితం నన్ను ఎన్నోసార్లు కింద పడిపేసింది. నేను ఎప్పటికీ కోరుకోని వాటిని నాకు చూపించింది. బాధ అనుభవించాను, ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాను. ఓ విషయం మాత్రం నేను కశ్చితంగా చెప్పగలను. ఏది ఎలా జరిగినా, ఎన్నిసార్లు కింద పడినా.... పైకి లేస్తూనే ఉంటాను. నాకు అండగా నిలిచిన వారికి, నన్ను అభిమానించిన వారికి, నాకోసం ప్రేయర్ చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.

 రేప్ జరుగలేదు

రేప్ జరుగలేదు

కాగా... ఈ నటిపై లైంగిక వేధింపుల ఘటన జరుగగా ఆమె రేప్ కు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రముఖ మళయాల దర్శకుడు ప్రియదర్శన్ స్పందించారు. . తాను స్వయంగా ఆమెతో మాట్లాడానని, తాను రేప్ కు గురి కాలేదని, వేధింపులకు గురైనట్లు ఆమె తెలిపారు... దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపాలని ప్రియదర్శన్ వెల్లడించారు.

 త్వరలో పెళ్లి

త్వరలో పెళ్లి

ఇదో బాధాకరమైన సంఘటన. ఆమెపై రేప్ జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తే ఆమెను చేసుకోబోయే వ్యక్తి మైండ్ సెట్ మారిపోవచ్చు. కానీ అతడు ఆమెకు అండగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి సమస్య లేదు. ముందుగా అనుకున్న ప్రకారమే పెళ్లి వేడుక జరిగే అవకాశం ఉంది అని ప్రియ దర్శన్ చెప్పుకొచ్చారు.

 ఉలిక్కిపడ్డ పరిశ్రమ

ఉలిక్కిపడ్డ పరిశ్రమ

ఈ సంఘటనతో సౌత్ సినీ పరిశ్రమ మొత్తం ఉలికి పడింది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ఆమెకు అండగా నిలిచారు. అన్ని వర్గాల నుండి ఒత్తిడితో ఈ కేసును కేరళ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు వెనక ఉన్న అసలు నిందితులను వెలికితీసేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

 ఎఫ్‌ఐఆర్‌లో షాకింగ్ వాస్తవాలు

ఎఫ్‌ఐఆర్‌లో షాకింగ్ వాస్తవాలు

ఓ టీవీ ఛానల్ ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లోని విషయాలు బయట పెట్టింది. అందులో పేర్కొన్న విషయాలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. త్రిశూర్‌కు సమీపంలోని పత్తురైక్కల్‌లో షూటింగ్‌ ముగించుకొని బాధిత నటి సాయంత్రం ఏడు గంటలకు తన వాహనంలో కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి బయలుదేరింది. నటి కారు బయల్దేరగానే కారు డ్రైవర్‌ మార్టిన్‌ కొందరికి ఎస్సెమ్మెస్‌లు పంపాడు. మార్టిన్‌ ఇచ్చిన సమాచారంతో పల్సర్‌ సునిల్ గ్యాంగ్‌ క్యాటరింగ్‌ వ్యాన్‌లో ఆమెను ఫాలో అయ్యారు.

 రాత్రి 8.30 గంటల సమయంలో

రాత్రి 8.30 గంటల సమయంలో

రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్‌పోర్ట్‌ జంక్షన్‌ వద్దకు ఆమె వావానం రాగానే పల్సర్ సునీల్ గ్యాంగ్ ఆమె కారును కావాలని ఢీ కొట్టి ఫేక్ యాక్సిడెంట్ చేసారు. కారు ఆగగానే ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) ఆమె కారులోకి చొరబడి తమ చేతులతో ఆమె నోటిని మూసారు. కేకలు వేయొద్దంటూ బెదిరించారు. ఆమె ఫోన్‌ను లాక్కున్నారు. ఆమె ఫోన్ లాక్కున్న తర్వాత కారు కొంత దూరం ముందుకు తీసుకెళ్లారు. ఏ-3 నిందితుడు (అతని పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదు) కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోయాడు. నల్ల టీషర్ట్‌ ధరించిన నాలుగో నిందితుడు కారులోకి ఎక్కాడు. అనంతరం మరో ఇద్దరు నిందితులు వాహనంలోకి వచ్చారు.

 ప్రధాన నిందితుడు

ప్రధాన నిందితుడు

కారు మరికొంతదూరం వెళ్లనిచ్చిన తర్వాత ఓ ఇంటి వద్ద ఆగింది. అక్కడ పల్సర్‌ సునిల్ ముఖానికి టవల్‌ కట్టుకొని వచ్చి డ్రైవర్‌ సీటులోకి మారాడు. అప్పటివరకు వాహనాన్ని నడిపిన మార్టిన్‌ గ్యాంగ్‌లోని మిగతా సభ్యులతో కలిసి క్యాటరింగ్‌ వ్యాన్‌లోకి ఎక్కాడు.

 అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు

అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు

పల్సర్‌ సునిల్ అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసేందుకు థర్డ్‌పార్టీ తరఫున తాను వచ్చానని, తనకు సహకరించాలని నటిని బెరించాడు. ఆమెను అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసిన తర్వాత కక్కనాడ్‌ సమీపంలోని పాదముద్గల్‌ వద్ద కారులోంచి ఆమెను బయటకు తోసారు.

 మత్తు మందు ఇస్తామని బెదిరించి మరీ

మత్తు మందు ఇస్తామని బెదిరించి మరీ

దాదాపు రెండున్నర గంటల పాటు నటిని కార్లో తిప్పుతూ ఈ అమానుషానికి పాల్పడ్డారు. తమ ప్రయత్నాన్ని ప్రతిగటిస్తే మత్తు మందు ఇస్తామని ఆమెను బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ రాక్షస కిరాయి మూక నటి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు.

English summary
Nearly two weeks after she was kidnapped and molested, an actress from the Malayalam film industry showed immense courage and took to herInstagram profile to break her silence. The actress who resumed shooting for her ongoing project took to the social networking site to declare that she would face all challenges that come her way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X