»   » రవితేజ అభిమానులకు మళ్లీ కిక్ మిస్సయినట్లేనా?

రవితేజ అభిమానులకు మళ్లీ కిక్ మిస్సయినట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘కిక్-2'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ అపీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి కూడా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని, పలు కారణాలతో సినిమాను వాయిదా వేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎందుకు వాయిదా వేస్తున్నారు? అనే విషయమై సరైన క్లారిటీ లేదు. ఈ వాయిదా నిజమే అయితే సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు కిక్ దొబ్బడం ఖాయం.


ఇటీవల కిక్ 2 రిలీజ్ విషయమై అఫీషియల్ ప్రెస్ నోట్...


Kick 2 movie Postponed again?

ఈ సందర్భంగా నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘మా కిక్-2 చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గా మా చిత్రాన్ని రిలీజ్ చేయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. థమన్ సారథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ఆడియో ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. ఆగస్టు 14న ఆడియోకి సంబంధించిన ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నాం. సినిమా చాలా ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. నిర్మాతగా నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను. అందరినీ ఆకట్టుకునేలా మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. డెఫినిట్ గా మా బేనర్లో ‘కిక్-2' మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది' అన్నారు.


సురేంద్ రెడ్డి మాట్లాడుతూ..‘యన్.టి.ఆర్ ఆర్ట్స్ బేనర్లో ‘అతనొక్కడే' చిత్రంలో డైరెక్టర్ గా పరిచయమైన నేను మళ్లీ ఇదే బేనర్లో సినిమా చేయడం, రవితేజతో ‘కిక్' తర్వాత మళ్లీ ‘కిక్-2' చిత్రం చేయడం చాలా హ్యాపీగా ఉంది. యన్.టి.ఆర్ ఆర్ట్స్ బేనర్లో అతనొక్కడే ఎంత పెద్ద హిట్టయిందో, రవితేజతో చేసిన ‘కిక్' ఎంత ఘనవిజయం సాధించిందో, వాటిని మించి ‘కిక్-2' సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది' అన్నారు.


మాస్ మహారాజా రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేంద్ రెడ్డి.

English summary
According to grapevine, Ravi Teja and Rakul Preet Singh starrer Kick 2 has been deferred. Although the movie was all set to release on Aug 21, the latest reports indicate that the movie is not hitting the theatres as per the plan. Inside sources confirmed that the movie would not make it on time and going to be delayed.
Please Wait while comments are loading...