For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాళ్లకు లక్షలు, మనకు తినడానికి లేక పెన్షనా?, అతడు నటుడా? ‘మా’ ప్రమాణ స్వీకారోత్సవంలో కోటా సంచలనం!

|
Kota Srinivasa Rao Sensational Speech At Maa Committee Swearing-In Ceremony

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో తెలుగు సినీ ప్రముఖుడు, సీనియర్ ఆర్టిస్ట్ కోటా శ్రీనివాసరావు తన సంచలనం ప్రసంగంతో అందరి కళ్లు తెరపించే ప్రయత్నం చేశారు. మీడియాకు వెళ్లి 'మా' పరువు తీయొద్దని, తెలుగు సినిమాల్లో తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు దక్కేలా కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా పరభాషా నటుల గురించి, అక్కడ తెలుగు వారిని ట్రీట్ చేస్తున్న విధానం గురించి కోట శ్రీనివాసరావు వెల్లడించారు. షాయజీ షిండే లాంటి భాష కూడా సరిగా పలకడం రాని వారిని తెలుగులో ప్రోత్సహిస్తున్న దౌర్భాగ్యంలో తెలుగు ఇండస్ట్రీ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు ఆర్టిస్టులకు పని ఉండేలా చేయండి

తెలుగు ఆర్టిస్టులకు పని ఉండేలా చేయండి

చాలా కాలంగా ‘మా' సభ్యుడిగా ఉన్నాను. అసోసియేషన్‌కు నేను మనవి చేసేది ఒకటే. వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి మనం సాయం చేయాలి, కాదనడం లేదు. అంతకంటే ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులకు అర్హతకు తగిన విధంగా నెలకు కనీసం పది పన్నెండు రోజులు పని ఉండేట్లు ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల కృష్ణా నగర్లో రోడ్డున పడకుండా గుట్టుగా బ్రతుకుతారని... కోటా సూచించారు.

వాళ్లకు లక్షలు, మనకు తినడానికి లేక పెన్షనా?

వాళ్లకు లక్షలు, మనకు తినడానికి లేక పెన్షనా?

నేను 5 భాషల్లో నటించాను కాబట్టి చెబుతున్నాను. మనల్ని అక్కడ ఎలా చూస్తారు అనేది నేను స్వయంగా అనుభవించాను. మద్రాసు అరవ(సామీ) సినిమాకు వెళితే ఒక మంచి హోటల్లో పెట్టండయ్యా అంటే పెట్టలేదు. కానీ మనం వాళ్లను తీసుకొచ్చి లక్షలు ఇచ్చి, వాళ్లతో పాటు వారి అసిస్టెంట్లను ప్లైట్లలో తీసుకొచ్చి స్టార్ హోటళ్లలో పెడితే వారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. మనకు తినడానికి లేక పెన్షన్ తీసుకుంటున్నాం...అంటూ కోట ఆవేదన వ్యక్తం చేశారు.

వైషమ్యాలు పక్కన పెట్టండి, అల్లరవుతున్నాం..

వైషమ్యాలు పక్కన పెట్టండి, అల్లరవుతున్నాం..

అసోసియేషన్లో వైషమ్యాలు, పోట్లాటలు, వర్గాల పోరాటాలు అన్నీ వదిలేయండి. ఇటీవల ఓటేయడానికి వస్తే మీడియా వాళ్లు నన్ను పట్టుకుని ఏదైనా చెప్పాలని అడిగారు. అసలు మీకు నేనెందుకు చెప్పాలయ్యా? ఏదో మా అసోసియేషన్, మా ఎన్నికలు. మీ వల్ల మేము అల్లరవుతున్నామని చెప్పినట్లు... కోట గుర్తు చేసుకున్నారు.

దమ్ముంటే వారిని తెండి, నౌకరు వేషం కూడా వేస్తా

దమ్ముంటే వారిని తెండి, నౌకరు వేషం కూడా వేస్తా

చాలా మంది నా మీద చేస్తున్న ఆరోపణ ... కోట శ్రీనివాసరావుకు పరభాషా నటులు అంటే ఇష్టం లేదు అని, అది చాలా తప్పు. నేను నటులను ఎప్పుడూ అనను. నీకు దమ్ముంటే నసీరుద్దీన్ షా, నానా పటేకర్, అమితాబ్ బచ్చన్ లను పట్టుకునిరా.. వారి వద్ద నౌకరు వేషం వేయమన్నా వేస్తాను.. అని కోట చెప్పుకొచ్చారు.

షాయాజీ షిండే అనేవాడు తెలుగులో పెద్ద ఆర్టిస్టా?

షాయాజీ షిండే అనేవాడు తెలుగులో పెద్ద ఆర్టిస్టా?

ఇక్కడ పేరు చెబుతున్నాను అని ఎవరూ ఏమీ అనుకోవద్దు... షాయాజీ షిండే అనేవాడు ఏం ఆర్టిస్టు చెప్పండి తెలుగులో? అతడు ఆ భాషలో గొప్ప ఆర్టిస్టు కావచ్చు నేను కాదనను. తెలుగులో అలాంటి నటులు లేరా? బాలుగారు లాంటి వారు పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో భాష సరిగా పలకాలి అని చెబుతుంటారు. మనం తెలుగు సరిగా పలకడం రాకున్నా అతడితోనే డైలాగులు చెప్పించడం చేస్తున్నామని కోటా మండి పడ్డారు..

అతడితో చేయను అని చెప్పేశా, విలువ పోతుంది

అతడితో చేయను అని చెప్పేశా, విలువ పోతుంది

షాయాజీ షిండే అనేవాడు యముడి డ్రెస్సు వేసుకుని దున్నపోతు మీద కూర్చుంటే ఆ డ్రెస్ వేసుకుని ఫోటో దిగడానికి వచ్చినట్లు ఉన్నాడే తప్ప అతడు యముడేంటి? అతడు ముందు నన్ను యాక్ట్ చేయమని 12 రోజులు డేట్స్ అడిగితే చేయనని చెప్పా. ఎందుకు అని నిర్మాత అడిగితే యముడు అంటే తెలుగు వారికి బ్రెయిన్లో ఒక ఫిగర్ ఉంది. ఒక రామారావుగారు, రంగారావుగారు, కైకాల సత్యనారాయణ లాంటి వారు ఉన్నారు. వాళ్లు అలాంటిది ఊహించుకున్నపుడు ఒక అంచనా ఉంటుంది. చివరకు చలపతిరావుగారితో వేయించమని రిక్వెస్ట్ చేశాను. అంతే కానీ ఇలా ఇన్సల్ట్ చేసుకుని అతడి టోన్ పెట్టడం వల్ల విలువ పోతుందని... కోట ఆవేదన వ్యక్తం చేశారు.

మనకే ఎందుకు ఈ తెగులు పెట్టింది?

మనకే ఎందుకు ఈ తెగులు పెట్టింది?

‘మా' అంటే ముందు మన తెలుగు ఆర్టిస్టులు, మన భాష ముఖ్యం. కానీ మనకు ఎందుకు తెగులు పట్టిందో అర్థం కావడం లేదు. నిర్మాత స్విచ్ అయితే, బల్బ్ ఆర్టిస్ట్ అయితే డైరెక్టర్ కరెంట్ లాంటి వారు. అదీ సినిమా అంటే. ఎవరి టాలెంట్ అయినా మన ద్వారానే బయటకు వస్తుంది. కవిగారు గొప్పగా రాయొచ్చు కానీ ప్రజలకు వెళ్లేది ఆర్టిస్టు ద్వారానే. ఆర్టిస్టు అంత గౌరవించపడతాడు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి, తెలుగు వారికి ప్రధాన్యత ఇవ్వండి అని... కోట చెప్పుకొచ్చారు.

జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలనం అంటూ హెడ్ లైన్ వేశారు

జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలనం అంటూ హెడ్ లైన్ వేశారు

ఇటీవల విడుదలైన సినిమాలో మోహన్ లాల్ గారు ఓ వేషం వేశారు. ఆయన చాలా బాగా చేశారని అందరూ అంటున్నారు... అని ఓ ఛానల్ వారు అడిగితే ‘ఆయన బాగా చేయడం ఏమిటండీ.. ఆయన మలయాళంలో గొప్ప నటులు. ఆయన కాకుంటే ఎవరు చేస్తారు? అంటే తెలుగు వారు ఎవరూ చేయలేదనా? హీరో, ఇతర నటులు చేయలేదనా? అలా అనడం తప్పు అని చెప్పాను... అంతే వెుంటనే జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలనం అంటూ హెడ్ లైన్ వేశారు.

మీడియాకు వెళ్లి అల్లరి కావొద్దు

మీడియాకు వెళ్లి అల్లరి కావొద్దు

ఇలాంటి మీడియా మాద్యమాల జోలికి వెళ్లకుండా, ‘మా' అసోసియేషన్ గురించి మీడియాకు అస్సలు వెళ్లకుండా ఉండాలని మనవి చేస్తున్నాను. ఏదైనా ఉంటే మనం మనం మీటింగులు పెట్టుకుని పెద్దల సమక్షంలో మాట్లాడుకుందాం. మీడియాకు వెళ్లడం వల్ల మనం ఎంత అల్లరి అవుతున్నామో తెలుసుకోండి, దీని వల్ల నటుల విలువలు పోతున్నాయని.... కోట చెప్పుకొచ్చారు.

English summary
Kota Srinivasa Rao sensational speech speech at MAA new committee Swearing-in Ceremony.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more