»   » ఊహకు అందని విధంగా... సూపర్ స్టార్ కృష్ణ

ఊహకు అందని విధంగా... సూపర్ స్టార్ కృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కృష్ణ, విజయనిర్మల జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీ'. ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. సాయిదీప్‌ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్‌ సిరాజ్‌ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ నిన్న రాత్రి జరిగింది. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Photos: శ్రీశ్రీ ఆడియో పంక్షన్మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘నాలుగైదు నెలల క్రితం ‘శ్రీశ్రీ' చిత్రంలో నాన్న గెటప్‌ చూసి ఆశ్చర్యపోయాను. నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. నాన్నకు నేను పెద్ద అభిమానిని. ఎప్పుడూ నాన్న నా సినిమా కార్యక్రమాలకు అతిథిగా వస్తుంటారు. ఈ రోజు నాన్న వేడుకకు నేను రావడం చాలా ఆనందంగా ఉంది. పాటలు బాగున్నాయి. చిత్రబృందానికి శుభాకాంక్షలు'' అన్నారు . ‘శ్రీశ్రీ' ఆడియో పంక్షన్ కు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై తొలి సీడీని ఆవిష్కరించారు. కృష్ణంరాజు స్వీకరించారు.


కృష్ణ మాట్లాడుతూ ‘‘నా సినీ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్మానించినందుకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇద్దరిని నేను గుర్తు చేసుకోవాలి. ఒకరు ‘తేనె మనసులు'తో నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావుగారు.


మరొకరు నాతో ‘గూఢచారి 116' చేసిన డూండీ. ఆ చిత్రంతో నన్ను తిరుగులేని మాస్‌ హీరోగా నిలబెట్టారాయన. నేను 50 ఏళ్లుగా వెనక్కి తిరిగిచూసుకోకుండా ప్రయాణం చేయడానికి కావల్సిన ధైర్యం ఇచ్చారు. శివ నాకు చెప్పిన మరాఠా కథ కంటే వందరెట్లు గొప్పగా ఉంటుందీ చిత్రం. నా కెరీర్‌లో ఇదో మైలురాయి'' అన్నారు.

English summary
Here is the Theatrical Trailer of Sri Sri Movie, released by Mahesh Babu in the audio launch at shilpakala vedhika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu