ప్రముఖ సంగత దర్శకుడు వైద్యనాధన్ మృతి

1932 లో లో సంప్రదాయ సంగీత కళాకారుల కుటుంబంలో జన్నించిన ఈయన చిన్నతనం నుంచే సంగీత సాధన చేసి ప్రశంసలు పొందేవారు. దైవం అనే తమిళ చిత్రంలోని వా రాజా వా అనే పాటతో ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆయన కంపోజ్ చేసిన Marudamalai Mamaniyae Murugaiyya...బాగా పాపులర్ అయి ఇప్పటికీ ఎక్కడో చోట వినపడుతూనే ఉంటుంది. ఎమ్.జి.ఆర్ నవరాత్రి సినిమాకు ఆయన ఇచ్చిన పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
తన జీవిత కాలంలో ఎందరో అభిమానులను,శిష్యులను, సంగీతానుచరులను సంపాదించుకున్న ఆయన మరణం తమిళ పరిశ్రమను తీవ్ర సంతాపానికి గురిచేసింది.ఆయన 1975 లో తమిళ ప్రభుత్వ కళైమామణి అవార్డును,2005 లో పద్మశ్రీని సొంతం చేసుకున్నారు. ఇక ఆయన ఎంతో మక్కువతో సంగీత ప్రధానంగా రూపొందించిన తోడి రాగం సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.


Click it and Unblock the Notifications











