»   » లేడీబాస్‌ విజయ శాంతి ఈజ్‌ బ్యాక్‌,పక్కా అయిపోయినట్టే..?

లేడీబాస్‌ విజయ శాంతి ఈజ్‌ బ్యాక్‌,పక్కా అయిపోయినట్టే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్ విజయ శాంతి. తన పర్ఫార్మెన్స్ తో మేల్ హీరోలకి ధీటుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ అమితాబ్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగారు. చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లతో ఆడి , పాడి ,ఎన్నో విభిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత లేడీ క్యారక్టర్ బేస్డ్ సినిమా లతో ముందుకెల్లింది. తెలుగులో పెద్ద హీరోల హవా నడుస్తున్న సమయంలోనే విజయ శాంతి చేసిన కర్తవ్యం ఒక సంచలనం అయ్యింది. ఆ కక్ష తోనే ఆమెని కొన్ని కేసుల్లో ఇరికించాలని చూసారన్న వార్తలూ ఉన్నాయి....

సడెన్ గా అఙ్ఞాతం లోకి

సడెన్ గా అఙ్ఞాతం లోకి

ఆ తర్వాత కూడా చాలాకాలమే విజయ శాంతి సినిమాల్లో కొనసాగారు విజయ శాంతి... ఆ తర్వత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ కూడా అయ్యారు.సొంత పార్టీ పెట్టారు., టీఆర్ఎస్ లో కూడా కీలకంగా ఉన్న విజయశాంతి ఏమైందో ఏమో కానీ సడెన్ గా అఙ్ఞాతం లోకి వెళ్ళిపోయింది.

మళ్ళీ నటనవైపు

మళ్ళీ నటనవైపు

ప్రస్తుతం రాజకీయ పరంగా ప్రస్తుతం ఆమె వెనకపడిపోయింది.ఈ గ్యాప్ వల్ల ప్రజలకు దూరమవ్వకూడదని భావిస్తోందట విజయశాంతి. కొంతకాలంగా రాజకీయాలకు,పబ్లిసిటీకీ దూరంగా ఉంటున్న విజయశాంతి ఇప్పుడు మళ్ళీ నటనవైపు చూస్తున్నారట. నిజానికి రాజకీయాల్లోకి రావటానికి ఆమె యాక్టింగ్ ని ఎంచుకున్నట్టు సమాచారం.

దేశభక్తికి సంబంధించిన కథ

దేశభక్తికి సంబంధించిన కథ

అందుకే సినిమాల్లో నటించాలనే ఆలోచనలో ఉందట. తెలంగాణ ఉద్యమంలో బిజీగా ఉండడం, అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించుకోవడంవల్ల కొంతకాలంగా సినిమా రంగానికి దూరంగా ఉన్నానని.ఇప్పుడు బాగానే ఉన్నానని, దేశభక్తికి సంబంధించిన కథలో తనకు తగిన పాత్రతో సినిమా తీసే పనిలో ఉన్నానని కొద్దిరోజుల క్రితం ఆమె అన్నట్టు వార్తలుకూడా వచ్చాయి.

150 రిలీజ్ టైమ్ లోనే

150 రిలీజ్ టైమ్ లోనే

ఒక దశలో అయితే చిరంజీవి 150 రిలీజ్ టైమ్ లోనే విజయ శాంతి సినిమాకూడా వస్తుంది అన్నవాళ్ళూ లేకపోలేదు. మళ్ళీ ఎక్కడా ఆ వార్త రాలేదు కానీ రీసెంట్ సమాచారం ప్రకారం విజయ శాంతి సినిమా విశయంలో సీరియస్ గా మొదలు పెట్టారట.. నటిగా మరో రౌండ్‌ కొట్టడానికి సిద్ధం అవుతున్న విజయశాంతి అందుకు తగ్గట్టుగా ఫిజిక్‌ను తయారు చేసుకోవడానికి జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఏడాది చివర్లో

ఈ ఏడాది చివర్లో

ఈ ఏడాది చివర్లో ఆమె నటించనున్న చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల టాక్‌. విజయశాంతి మళ్లీ నటిస్తున్నారంటే అది కచ్చితంగా భారీ చిత్రమే అవుతుంది. అదే విధంగా ద్విభాషా చిత్రం అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. విజయశాంతి రీఎంట్రీ చిత్రం వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఓసేయ్ రాములమ్మ

ఓసేయ్ రాములమ్మ

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన "ఓసేయ్ రాములమ్మ" 1997లో విడుదలై అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో నటనకు గాను నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా విజయశాంతి గెలుచుకుంది.

లేడీ సూపర్‌స్టార్‌

లేడీ సూపర్‌స్టార్‌

తనకు నటిగా అపరితమైన గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని విజయశాంతి భావిస్తున్నట్లు ఆ మధ్య చెప్పుకున్నారు. మరిప్పుడు వచ్చేది రాములమ్మ కి సీక్వెలేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. 1980లో నటిగా పరిచయం అయిన విజయశాంతి ఆదిలో గ్లామర్‌ పాత్రల్లో నటించినా ఆ తరువాత లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ పొందారు. మరి ఇప్పుడూ అదే క్రేజ్ ఉంటుందా అన్నదే ఇండస్ట్రీ అనుమానం.

English summary
If sources are to be believed, Vijayashanti is making all the arrangements to make a comeback to films. She has bid adieu to films a long time back and got busy in politics. Lately, her political career is not flourishing as expected and she has decided to make a U turn to movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu