»   »  క్షమించమంటూ మంచు లక్ష్మి, ఏ విషయంలో...అసలేం జరిగింది

క్షమించమంటూ మంచు లక్ష్మి, ఏ విషయంలో...అసలేం జరిగింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మి ముక్కు సూటి వ్యక్తిత్వం అని ఆమెతో పరిచయమైన ఎవరైనా చెప్తూంటారు. అలాగే ..కేవలం సినిమాల విషయంలోనే కాదు...సామాజిక అంశాలపై కూడా తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా లక్ష్మి ప్రసన్న స్పందిస్తూ వార్తల్లో ఉంటూంటుంది. ఆమె త్వరలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారి ...ఆమె ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఆ ట్వీట్ ..ఇప్పుడు క్షమాపణ అడిగేలా చేసింది.

' గత నెల ఇదే రోజు.. కాస్ట్రో జీవించి ఉన్నాడు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకొనేందుకు సిద్ధమవుతోంది. మీ అందరి దగ్గర డబ్బుంది' అంటూ ట్వీట్ చేసింది.

అయితే ఈ ట్వీట్ తాను ముందుగానే చేశానని అదే ట్వీట్ ను మంచు లక్ష్మీ కాపీ చేసిందంటూ సదరు వ్యక్తి లక్ష్మీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయటంతో ఆమె క్షమాపణ చెప్పింది.

తనకు ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఆ మెసేజ్ లో పేరు లేకపోవటంతో క్రెడిట్ ఇవ్వకుండానే తాను ట్వీట్ చేశానని అందుకు తనను క్షమించాలని కోరింది.అంతేకాదు ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆ వ్యక్తిని అభినందించింది.

Lakshmi Manchu Apologies To Stranger

మంచు లక్ష్మీప్రసన్న కెరీర్ విషయానికి వస్తే...ఆమె టైటిల్‌ పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌'. ఈ చిత్రాన్ని డిసెంబరు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. 'జడ్జి పాత్రలో తొలిసారి నటించాను. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ సింగిల్‌ షెడ్యూల్‌లోనే చక్కగా సినిమాను పూర్తి చేశారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాను డిసెంబరు 23న విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు' అన్నారు.

ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూర్చారు. పోసాని కృష్ణమురళి, హేమ, ప్రభాకర్‌, భారత్‌రెడ్డి, జీవా, అమిత్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

English summary
Actress Lakshmi Manchu rendered an apology on her Twitter handle after a user claimed that his tweet was copied by her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu