»   » ప్రకాష్ రాజ్ మాజీ భార్య మళ్లీ రంగంలోకి....

ప్రకాష్ రాజ్ మాజీ భార్య మళ్లీ రంగంలోకి....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడు ప్రకాష్‌రాజ్ మాజీ భార్య లలితకుమారి మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్నారు. తాజాగా తమిళ మూవీ ‘CSK-చార్లెస్ షేపిక్ కార్తికా' విషయంలో ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు. సినిమా ఎంతో బాగా వచ్చిందని, తెర వెనక ఉంటూ లలిత కుమారి టెక్నీషియన్స్‌ని ఎంతో ప్రోత్సహించారని, లలితకుమారి లేకుంటే ఈ చిత్రం లేదని చెప్పుకొచ్చారు దర్శకుడు సత్యమూరి శరవణన్.

ఆడియో వేడుకలో లలిత కుమారి మాట్లాడుతూ...చిత్రకారుడైన సత్యమూర్తి శరవణన్ లలితకుమారి కూతురికి చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చారట. ప్రకాష్ రాజ్ వద్ద ‘ఇనిదుఇనిదు' తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన సత్యమూర్తి సీఎస్‌కే చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. లలితకుమారి మాట్లాడుతూ ఈ రోజు తన కూతురు విదేశాల్లో ఫైన్ ఆర్ట్స్ రంగంలో పెద్ద చదువులు చదువుతుందంటే అందుకు ఈ చిత్ర దర్శకుడు సత్యమూర్తి శరవణనే కారణం అన్నారు.

Lalitha Kumari about CSK Movie

ఆయనరుణం తీర్చుకోవడానికి ఏమైనా చేయాలన్న భావనతోనే ప్రకాష్‌రాజ్ వద్ద సహాయ దర్శకుడిగా చేర్పించానన్నారు. అదే విధంగా ఈ ‘చార్లెస్ ఫేషిక్ కార్తికా' చిత్రానికి తన చేతనైన సాయం చేశానని అన్నారు. కలైపులి ఎస్.థాను, రాధాకృష్ణన్, దర్శకుడు అట్లీ, రంజిత్, నటుడు బాబి సింహా, నటి చంద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. చరణ్‌కుమార్, మిషాల్ నజీర్, జయ్‌కుహ్యాణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్ ఫిలిం పతాకంపై శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు.

లలిత కుమారి విషయానికొస్తే...తమిళ యాక్టర్ సి.ఎల్.ఆనందన్ కూతురైన లలిత కుమారి నటిగా పలు తమిళ చిత్రాల్లో నటించింది. 1994లో ప్రకాష్ రాజ్ తో ఆమె వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కూతుర్లు జన్మించారు. అయితే 2009లో ప్రకాష్ రాజ్-లలిత కుమారి విడిపోయారు.

English summary
Costume L Lalitha Kumari Speaks at Charles Shafiq Karthika Movie Audio Release Function.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu