»   »  లీక్: డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సూపర్ స్టార్ (వీడియో)

లీక్: డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సూపర్ స్టార్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం 'ఫ్యాన్‌'. ఈ చిత్రం డిల్లీలో ఉండే ఆర్యన్ ఖన్నా (షారూఖ్ పాత్ర) చుట్టూతిరుగుతుంది. అతనికి గౌరవ్ అనే పెద్ద ప్యాన్ ఉంటాడు. వీరిద్దరి చుట్టూ కథ తిరుగుతుంది. కథనం ప్రధానంగా చిత్రం ఉండనుందని సమాచారం.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో షారూఖ్ ఖాన్ ...డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసిన ఓ వీడియోని లీక్ చేసారు. ఆ వీడియో ఇనిస్ట్రిగ్రామ్ లో అప్ లోడ్ చేసారు. షారూఖ్ ఖాన్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఈ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

FAN 😍 #srk #shahrukhkhan #dance #fan #fanmovie

A video posted by ◀Shahrukh (@rj_shahrukh) on Jan 16, 2016 at 2:52am PST

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2016, ఏప్రిల్‌15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షారూఖ్‌ .. బ్యాండ్‌ బాజా బారత్‌, శుద్ద్‌ దేశీ రొమాన్స్‌' వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్‌ దర్శకుడు మనీష్‌ తివారి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది.

Leaked Video of Shah Rukh Khan

అయితే ఈ సినిమా పేరు 'ఫ్యాన్‌' అనేది ఓ విశేషమైతే.. ఈ చిత్రంలో షారూఖ్‌.. తన ఫ్యాన్‌గా నటించడం మరో విశేషం. కాస్త వెరైటీ.. కాస్త ఆసక్తికరంగా.. మరికాస్త కొత్తగా ఉన్న ఈ కాన్సెప్ట్‌ నచ్చడంతో షారూఖ్‌ ఖాన్‌ కూడా వెంటనే ఓకే చెప్పాడని బాలీవుడ్‌ సమాచారం. మరి బాలీవుడ్‌లో ప్రయోగాత్మకమైన చిత్రాలను ఇష్టపడే షారూఖ్‌.. ఈ మూవీతో ఫ్యాన్‌గా తన ఫ్యాన్స్‌ను ఎంత వరకు ఎంటర్‌టైన్‌ చేస్తాడో చూడాలి.

English summary
Recently, an SRKian shared a video of the shooting of a song sequence which shows SRK dancing his heart out in a balcony. The actor enthusiastically completes shooting for the track in one take.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu