»   » నా చివరి శ్వాస వరకు అలానే చేస్తా: బాలకృష్ణ

నా చివరి శ్వాస వరకు అలానే చేస్తా: బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘నా చివరి శ్వాస వరకు వైవిద్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తాను' అని నందమూరి నట సింహం బాలకృష్ణ స్పష్టం చేసారు. ఇటీవల లయన్ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...‘ మహానటుడు ఎన్టీఆర్ కడుపున పుట్టడం నేను చేసుకున్నఅదృష్టం. ఆయన చేసినట్లే కొత్తదనం కోసం తపన పడుతుంటారు. నాలో శక్తి ఉన్నంత వరకు వైవిద్యమైన పాత్రలే చేస్తాను' అన్నారు.

‘సింహా, లెజెండ్ వంటి హిట్ సినిమాల తర్వాత ఏ తరహా సినిమాలు చేస్తే బావుంటుందన్న ఆలోచనలో ఉన్నపుడు ఐదేళ్ల క్రితం సత్యదేవ చెప్పిన కథ గుర్తొచ్చింది. వెంటే ఆయన్ను పిలిచి కథ మీద వర్క్ చేసాం. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా చేసాం. ఇందులో మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించా. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది' అని బాలయ్య చెప్పుకొచ్చారు.

 Lion Success Meet

ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ అభిమానులను నిరాశ పరచదు అని అనుకున్నాం. మా నమ్మకం నిజమై సినిమా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. సినిమాలో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి...అభిమానులకు నచ్చిన సినిమా ఇది అన్నారు.

దర్శకుడు సత్యదేవ మాట్లాడుతూ...రెండు హిట్ సినిమాల తర్వాత ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం సాహసంతో కూడిన పని. బాలయ్య నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చారు. కథ చెప్పగానే నటనకు స్కోపు ఉందని, మంచి సినిమా అవుతుందని నమ్మి ఈ సినిమా చేసామని తెలిపారు.

English summary
Telugu Movie Lion Success Meet event held at hyderabad.
Please Wait while comments are loading...