ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌కి కారణమైన వ్యక్తి ఏమన్నాడో తెలుసా!
ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అరవింద సమేత వీరరాఘవ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ మాస్ లుక్ లో కళ్ళు చెదిరే స్టైల్ లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ గత కొన్ని నెలలుగా ఈ చిత్రం కోసం జిమ్ లో కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే.

హాలీవుడ్ ఫిజికల్ ట్రైనర్ లియోడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ సాధించాడు. తక్కువ సమయంలో ఎన్టీఆర్ తన లుక్ మార్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్టీవెన్స్ సోషల్ మీడియాలో స్పందించాడు. నా స్నేహితుడు ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడే తత్వమే ఎన్టీఆర్ కొత్త లుక్ కి కారణం అంటూ అరవింద సమేత ఫస్ట్ లుక్ గురించి తెలిపాడు.


Click it and Unblock the Notifications











