Just In
- 31 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గ్లామర్ గా ఉంటాను కానీ మరీ బట్టలిప్పెయ్యను : లావణ్యా త్రిపాఠి
ఇప్పుడు శర్వానంద్ తో చేస్తున్న రాధ తప్ప మిస్టర్ తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చే సినిమాలేవీ లేవు లావణ్య త్రిపాఠీ చేతిలో. అయితే రాధ లో తనది పెద్దగా నటనకు అవకాశం ఉన్న పాత్రేమీ కాదట, నాగ చైతన్య తో చేస్తున్న సినిమా మాత్రం నటనా పరంగా ఖచ్చితంగా తనకి ప్లస్ అవుతుందనే నమ్మకం తో ఉంది. నిన్నా మొన్నటి వరకూ పెద్దగా గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపని లావణ్య వచ్చే ప్రమాదాన్ని కాస్త ముందుగానే గ్రహించింది. మరీ మడికట్టుకుంటే తెరమీద రాణించటం కష్టం అని అర్థమయిన వెంటనే కాస్త రూటు మార్చి గ్లామర్ పాత్రల వైపుకూడా కాస్త దృష్తి పెట్టింది...

అందాల రాక్షసి
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. ఆ సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి టాలెంట్ తో నిజంగానే అందాల రాక్షసిలా కనిపించి యువతను ఆకట్టుకుంది. అమాయకమైన ముఖంలోనే గడుసు ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించిన లావణ్య.. లేటెస్ట్ గా మెగాయంగ్ హీరో వరుణ్ తేజ్ పక్కన ‘మిస్టర్' సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

మోడ్రన్ గానే ఉంటాను
'నేను రియల్ లైఫ్ లో అందాల రాక్షసి క్యారక్టర్ కు ఇసుమంత దగ్గరగా కూడా ఉండను. అంతా కూడా మోడ్రన్ గానే ఉంటాను. అలాగే మోడలింగ్ సమయంలో కూడా గ్లామర్ నే ఒలకబోశాను. అందుకే నేను చాలాసార్లు నా డైరక్టర్లకు చెప్పాను.. నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వండి అని.

బట్టలిప్పేస్తానని కాదు
గ్లామర్ అంటే ఉన్నపలంగా బట్టలిప్పేస్తానని కాదు.. రోల్ కు కావల్సినట్లు మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో గ్లామరస్ గా కనిపిస్తానని అర్ధం. పూర్వం పూర్తిగా కప్పుకుని కూడా గ్లామర్ అనేవారు. ఇప్పుడు పద్దతులు మారాయి. చూద్దాం ఎవరు ఎటువంటి రోల్స్ ఆఫర్ చేస్తారో'' అంటోంది లావణ్య.

ఎక్కువ స్కిన్ షో చేసిన హీరోయిన్లు
నిజమే హీరోయిన్ కి గ్లామర్ అవసరమే కానీ గ్లామర్ గా కనిపించటం అంటే విపరీతమైన ఎక్స్ పోజింగ్ కాదన్న విషయం అర్థమైన వాళ్ళు తక్కువే... మొదటి నుంచీ కూదా మరీ ఎక్కువ స్కిన్ షో చేసిన హీరోయిన్లు ఎక్కువ కాలం తెరమీద నిలబడలేదు... రంబా, రమ్య కృష్ణ ఆ రోజుల్లోనే స్కిన్ షో చేసినా ఎక్స్పోజింగ్ తో పాటు మామూలు పత్రల్లో కూడా నటించి ఇప్పటికీ ఫీల్ద్ లోనే ఉంది.

రమ్యకృష్ణ ఫార్ములా
ఇక అసలు గ్లామర్ అన్న మాటే ఎత్తని శరణ్యా మోహన్ లాంటి హీరోయిన్లు ఏమైపోయారో తెలిసిందే కదా... అప్పట్లో రమ్యకృష్ణ ఫార్ములాని ఫాలో అయ్యి అటు గ్లామర్ నీ, ఇటు నటననీ ప్రదర్శిస్తూ ఎక్కువకాలం నిలబడగలిగింది నయన తార ఒక్కరే... మిగతా ఏ హీరోయినూ ఎక్స్పోజింగ్ మాత్రమే వాడి టాప్ పొజిషన్ లో ఎక్కువ కాలం నిలబడ లేదు. ఎక్స్పోజింగ్ కీ, గ్లామర్ కీ ఉన్న చిన్న తేడాని పాటిస్తూనే నటనని కూడా వాడటమే ఇప్పుడు కావాల్సింది మరి లావణ్య త్రిపాఠీ ఏలా నెట్టుకొస్తుందో చూడాలి...