»   »  దాసరి టీం vs మెగా క్యాంప్: రసవత్తరంగా 'మా' ఎలక్షన్స్ !

దాసరి టీం vs మెగా క్యాంప్: రసవత్తరంగా 'మా' ఎలక్షన్స్ !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ అసోషియేషన్‌కు జరుగుతున్న ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా అయ్యేటట్లు చూస్తామని ‘మా' అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఎబిఎన్ ఛానల్‌తో మాట్లాడుతూ దాసరి నారాయణరావు లాంటి పెద్దల సాయం కూడా తీసుకుంటామని అన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యాక అందరితో చర్చించి, ఏకగ్రీవానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారానికి మందుండే వ్యక్తి గురువు గారు దాసరి. ఇప్పుడు మరోసారి ఆయన వైపు ఇండస్ట్రీ చూస్తోంది. తెలుగు సినీ నటుల సంఘమైన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌' (మా) ఎన్నికల్లో రసవత్తర ఘట్టానికి తెరలేచిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న ‘మా' ఎన్నికలు జరగుతున్నాయి. అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక ఖాయమనుకుంటున్న దశలో, ఆఖరి నిమిషంలో నటి జయసుధ ఆయనకు పోటీగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. అసలు ఉన్నట్టుండి జయసుధను తెరపైకి తెచ్చింది దాసరి వర్గమే అనే వాదన వినిపిస్తోంది.

MAA Elections: Murali Mohan Trying Unanimous

ప్రస్తుత అధ్యక్షుడు, దాసరి శిష్యుడైన మురళీమోహన్‌ జయసుధకు మద్దతు ప్రకటించారు. రాజేంద్రప్రసాద్‌కు నాగబాబు మద్దతు ప్రకటించారు. నాగబాబు మద్దతు ఉందంటే చిరంజీవి, ఆయన వర్గం మద్దతు ఉన్నట్లే. దీంతో ఇప్పుడు రెండు వర్గాలుగా ఈ ‘మా' ఎన్నికలు జరుగనుండటం హాట్ టాపిక్ అయింది. అయితే దాసరిగారు కలగ చేసుకుని సెటిల్ చేస్తారని కొందరంటున్నారు. ఎందుకంటే రాజేంద్రప్రసాద్ కు, జయసుధకు ఇద్దరి మధ్యా మంచి రిలేషన్ ఉన్న వ్యక్తి దాసరి.

ఈ పరిణామాలు సినీ వర్గాలను అమితాశ్చర్యంలో ముంచెత్తాయి. ఎందుకంటే.. సినీ పెద్దలు, సంఘ సభ్యులు తనకు సహకారం అందిస్తున్నందునే ‘మా' అధ్యక్షునిగా ఉండేందుకు నిర్ణయించుకున్నానని రాజేంద్రప్రసాద్‌ ఈ నెల 2న పత్రికా సమావేశంలో ప్రకటించారు. ముప్పై ఏడేళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను, ఇదే రంగంలో ఉన్న కళాకారులకు ‘మా' అధ్యక్షుడిగా తన వంతు సేవ అందించాలనుకుంటున్నానని తెలిపారు. అయితే రాజేంద్రప్రసాద్ వస్తే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో మెగా క్యాంపు ఆధిపత్యం పెరిగిపోతుందని భావించిన దాసరి వర్గం జయసుధను రంగంలోకి దింపినట్లు చర్చించుకుంటున్నారు.

English summary
"We'll take unanimous decision on Movie Association elections" Murali Mohan said.
Please Wait while comments are loading...