»   » నన్నొక లవర్‌గానే‌ చూశాడు...అందుకే ఇగో హర్ట్ చేశా: మాధవీలత

నన్నొక లవర్‌గానే‌ చూశాడు...అందుకే ఇగో హర్ట్ చేశా: మాధవీలత

Posted By:
Subscribe to Filmibeat Telugu

అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమలో పడటం సర్వ సాధారణం. కొంత మంది భయంతో ఈ విషయాలను తమ మనసులోనే దాచుకుంటారు. కొందరు ధైర్యంగా ప్రపోజ్ చేసి తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. వారు ప్రేమలో సక్సెస్ అయ్యారా? లేదా? అనేది తర్వాతి విషయం.

ఇలాంటి అనుభవాలు దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. తన జీవితంలోనూ ఇలాంటి లవ్ మెమొరీస్ ఉన్నాయి అంటోంది తెలుగు హీరోయిన్ మాధవీ లత. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తనకు ఓ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

హైదరాబాద్ వచ్చాకే మొదలైంది

హైదరాబాద్ వచ్చాకే మొదలైంది

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒకబ్బాయితో స్నేహం ఏర్పడింది. అతడు చాలా మంచి వ్యక్తి. నా పట్ల చాలా కేర్ తీసుకునే వాడు. కొన్ని రోజుల తర్వాత లవ్ ప్రపోజ్ చేశాడని మాధవీ లత తెలిపారు.

'Ego' Movie Hero And Heroine Speech At Movie Launch
అలాంటి అభిప్రాయం లేదని చెప్పా

అలాంటి అభిప్రాయం లేదని చెప్పా

అతడు లవ్ ప్రపోజ్ చేసిన వెంటనే షాకయ్యాను. ఎందుకంటే అప్పటి వరకు అతడిని నేను కేవలం ఫ్రెండుగా మాత్రమే చూశాను. ఇది అందరమ్మాయిలూ చెప్పే మాటే అయినా నేను మాత్రం నిజంగా చెబుతున్నాను. నాకు అలాంటి అభిప్రాయం లేదని అతడికి తేల్చి చెప్పినట్లు మాధవి లత తెలిపారు.

నన్ను లవర్ గానే చూస్తానన్నాడు

నన్ను లవర్ గానే చూస్తానన్నాడు

నేను అలా చెప్పగానే.... నీ అభిప్రాయం నీది. నీ ఫీలింగ్ నీది. నన్ను ప్రేమించమని ఫోర్స్ చేయడం లేదన్నాడు. నేను వెంటనే ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పాను. కానీ అతడు నేను నిన్ను ఫ్రెండుగా ఎప్పుడూ ఊహించుకోలేదు, అందుకే అలా ఉండటం నా వల్ల కాదు, లవర్ గానే చూస్తానని చెప్పాడని....మాధవి లత తెలిపారు.

అతడు చెప్పింది చాలా నచ్చింది

అతడు చెప్పింది చాలా నచ్చింది

ఒక అమ్మాయిని ప్రేమించినపుడు ఆమె నో చెబితే ఫ్రెండుగా కంటిన్యూ అవుతాను అనే వాడిది నిజమైన ప్రేమ కాదు. నిజంగా ప్రేమించిన వాడు ఆమెను జీవితాంతం లవర్ గానే చూస్తాడు. ఆమెకు వేరే వారితో పెళ్లయి పిల్లలు పుట్టినా, ముసలిదైనా ఆమెపై ప్రేమ తగ్గదు. నాది నిజమైన ప్రేమ. నువ్వు నన్ను ఫ్రెండుగా చూసినా, నా మనసులో నువ్వు ఎప్పుడూ లవర్‌గానే ఉండిపోతావు అన్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించలేదు. అతడు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది అని మాధవి లత తెలిపారు.

కావాలనే అతడి ఇగో హర్ట్ చేశా

కావాలనే అతడి ఇగో హర్ట్ చేశా

అతడు చెప్పిన మాటలకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అతడితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే, నాపై అతడి ప్రేమ కూడా కంటిన్యూ అవుతుందని..... కావాలనే కొన్ని బాధ పెట్టే విషయాలు మాట్లాడి అతడి ఇగోను హర్ట్ చేశాను. నేను చేసింది తప్పే అయినా అతడికి ఇప్పటికీ సారీ చెప్పలేదు అని మాధవి లత పాత విషయాలను గుర్తు చేసుకున్నారు.

English summary
Madhavi Latha Remembers Love Proposals. Maadhavi Latha is an Indian film actress, who has appeared in Telugu and Tamil films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu