»   » ఇంకో రోగంతో వస్తున్న మారుతీ: ఇంకో క్యూట్ డిజార్డర్ "మహానుభావుడు"

ఇంకో రోగంతో వస్తున్న మారుతీ: ఇంకో క్యూట్ డిజార్డర్ "మహానుభావుడు"

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ హీరో శ‌ర్వానంద్ 'మ‌హానుభావుడు' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి మారుతి ద‌ర్శ‌కుడు. ఇది 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' త‌ర‌హా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఆ సినిమాలో నాని క్యారెక్ట‌ర్ ఎంత గొప్ప‌గా పండిందో తాజా సినిమాలో శ‌ర్వా క్యారెక్ట‌ర్ అంత గొప్ప‌గా పండుతోందట‌. పేరుకు త‌గ్గ‌ట్టే మ‌హానుభావుడి వేషాలు అంద‌రికీ క‌డుపుబ్బా న‌వ్వు ర‌ప్పిస్తాయ‌ని చెబుతున్నారు.

 టీజర్ విడుదలైంది

టీజర్ విడుదలైంది

శర్వానంద్, మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో శర్వానంద్ లుక్ కే సగం మార్కులు పడిపోగా, కాన్సెప్ట్ మాత్రం అభిమానులలో అంచనాలు పెంచేసింది. ఓసీడీ అనే డిసార్డర్ ని పట్టుకొని సినిమా మొత్తాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రన్ చేయనున్నాడు మారుతి.

Maruthi Excellent Speech | Gulf Telugu Movie Audio Launch
పొల్లాచిలో షూటింగ్

పొల్లాచిలో షూటింగ్

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచిలో షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుండగా, దసరా కానుకగా చిత్రం విడుదల కానుందని అంటున్నారు. యూరప్ , పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో ఇటలీ, ఆస్ట్రియా, క్రోటియా వంటి అందమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకోనుంది. తాజాగా విడుదలైన టీజర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.

Obsessive Compulsive Disorder

Obsessive Compulsive Disorder

‘భలే భలే..'లో నాని మతిమరుపు వాడైతే.. మారుతి కొత్త సినిమా ‘మహానుభావుడు'లో హీరో శర్వానంద్ ఓసీడీతో బాధపడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఓసీడీ అంటే..(obsessive compulsive disorder) అతి శుభ్రతతో బాధపడే ఒక డిసార్డర్ అన్నమాట. దీంతో బాధపడేవాళ్లకు దేన్నయినా అతిగా శుభ్రం చేయడం.. అపరిశుభ్రత గురించి తెగ కంగారు పడటం అలవాటు. ‘భలే భలే..'లో మతిమరుపు కాన్సెప్ట్ లాగే ఇది కూడా హిలేరియస్ గా వర్కవుటైనట్లే కనిపిస్తోంది.

 ఓసీడీ డీసార్డర్

ఓసీడీ డీసార్డర్

‘మహానుభావుడు' టీజర్ చూస్తుంటే. బాస్ ఏదో చెప్పబోతూ తుమ్ముతుంటే.. పరుగెత్తుకెళ్లిపోయి ఆఫీసులో ఓ మూలకు వెళ్లిపోవడం మొదలు.. ఓసీడీ డీసార్డర్ వల్ల హీరో విచిత్ర విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి హీరోయిన్ ముద్దివ్వబోతుంటే బ్రష్ చేశావా అనే స్థాయికి చేరుతుంది అతడి పిచ్చి.

యువి క్రియేషన్స్

మొత్తానికి ‘మహానుభావుడు' టీజర్ చూస్తే.. మారుతి ఈజ్ బ్యాక్ అనే అనిపిస్తోంది. ‘భలే భలే..' సినిమా నిర్మాణంలో భాగస్వాములైన యువి క్రియేషన్స్ వాళ్లే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ' ఫేమ్ మెహ్రీన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ‘మహానుభావుడు' దసరా కానుకగా విడుదల కానుంది.

English summary
Director Maruthi and Sarvanand combo Movie Mahanubhavudu Teaser Released
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu