»   » ఆ పుస్తకం చదవటానికి ఎదురుచూస్తున్నా, ఎమోషనల్ గా చెప్పిన మహేష్ బాబు

ఆ పుస్తకం చదవటానికి ఎదురుచూస్తున్నా, ఎమోషనల్ గా చెప్పిన మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో నిందలు కానీ , చెడ్డ పేరు కానీ లేని హీరో ఎవరూ అంటే సూపర్ స్టార్ కృష్ణ అని చెప్తారు. నిర్మాతలు చాలా మంది ఆయన్ను దేవుడుతో సమానంగానే చూసేవారు. డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఆయన సినిమా వస్తోందంటే చాలా శ్రద్దా,ఆసక్తులతో పనిచేసేవారు. అందుకు కారణం ఆయన అందరితోనూ మెలిగే తీరు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే విధానం. అలాంటి సూపర్ స్టార్ పై ఇప్పుడో పుస్తకం వస్తోంది. ఆ పుస్తకం గురించి ఆయన కుమారుడు మహేష్ బాబు సోషల్ మీడియాలో మాట్లాడారు.

తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ... దేవుడి లాంటి మనిషని.. ఆయన వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ఓ ప్రత్యేక ముద్రవేసుకున్న మహేష్ బాబు తెలియచేసారు. ఇవాళ కృష్ణకు సంబంధించిన ఒక పుస్తకాన్ని విడుదల చేసారు. ఈ విషయాన్ని మహేష్ బాబు తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

''దేవుడులాంటి మనిషి' పుస్తకాన్ని ఇవాళ విడుదల చేస్తున్నాం. మా నాన్నకి సరిగ్గా సరిపోయే టైటిల్‌ ఇది.. పుస్తకం చదవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఈ సందర్భంగా పుస్తకం కవర్‌ పేజీ ఫొటోను షేర్‌ చేశారు. 1965 నుంచి 2015 వరకు కృష్ణ సినీ జీవితాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావిస్తున్నట్లు ఫొటోను చూస్తే అర్దం అవుతోంది. ప్రముఖ పాత్రకేయుడు యు. వినాయకరావు ఈ పుస్తకాన్ని రచించారు.

కృష్ణగారి విషయానికి వస్తే...ముప్పలనేని శివ దర్శకత్వంలో 'శ్రీశ్రీ' చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక మహేష్ ప్రస్తుతం ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'సంభవామి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

English summary
Mahesh Babu said he is very eagerly waiting for the book ‘Devudulanti Manishi,’ which is based on his father superstar Krishna. Mahesh took it on his official Twitter handle and added that he can’t wait to turn the page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu