»   » ఫేస్ బుక్ లో మహేశ్‌బాబు ఫొటో రచ్చ

ఫేస్ బుక్ లో మహేశ్‌బాబు ఫొటో రచ్చ

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు ఫేస్ బుక్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఈ దీపావళి వేడుకల్ని తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఆయన షేర్ చేసిన ఫొటో ఇప్పుడు అభిమానులను ఓ రేంజిలో అలరిస్తోంది. ఆ ఫొటోని మీరూ చూడండి.

Wishing you and your families a very happy and safe Diwali! #IndiaCelebrates

Posted by Mahesh Babu on 10 November 2015


మరో ప్రక్క... రేంజ్ రోవర్ కారును దీపావళి పండుగ సందర్భంగా మహేష్ కొన్నారు. ఆ కారు ముందు, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి మహేష్ బాబు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇటీవలే కుటుంబంతో తో కలిసి ప్యారిస్ ట్రిప్ ముగించుకొని వచ్చిన మహేష్ బాబు తిరిగి షూటింగ్ లతో బిజీ అయ్యాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి మంచి విజయాన్ని అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొంటున్నాడు మహేష్.

Mahesh2

కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పివిపి సినిమాస్ బ్యానర్ తో పాటు మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2016 వేసవిలోరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

English summary
Mahesh Babu shared a photo in Fb with Divali Wishes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu