»   » మహేష్ బాబుకు తెగ నచ్చేసింది: విజువల్ ట్రీట్ ...(ట్రైలర్)

మహేష్ బాబుకు తెగ నచ్చేసింది: విజువల్ ట్రీట్ ...(ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం 'ఒకే కణ్మని' సౌత్ లో మంచి విజయం సాధించింది. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో 'ఒకే బంగారం' పేరుతో రిలీజైన సంగతి తెలిసిందే.

ఇపుడు ఇదే చిత్రాన్ని హిందీలో 'ఒకే జాను' పేరుతో రీమేక్ చేస్తున్నారు. హిందీలో ఈ చిత్రానికి షాద్ అలీ దర్శకత్వం వహిస్తుండగా.... మద్రాస్ టాకీస్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై మణిరత్నం, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హిందీలో ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూసిన మహేష్ బాబు ఓ ట్వీట్ చేసారు.

రవి కె. చంద్రన్ గురించి ట్వీట్

ఒకే జాను ట్రైలర్ చూసాను. చాలా బావుంది. విజువల్ ట్రీట్ లా ఉంది. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ వర్క్ ఎప్పుడూ బ్రిలియంట్ గానే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్... అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

ట్రైలర్

ఒకే జాన్ ట్రైలర్ ఇదే. సౌత్ లో మణిరత్నం స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహిస్తే... హిందీలో మాత్రం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అదిరిపోయే రెస్పాన్స్

అదిరిపోయే రెస్పాన్స్

ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ ట్రైలర్ 7 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

సేమ్ టు సేమ్ రీమేక్

సేమ్ టు సేమ్ రీమేక్

సినిమాలో ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టు సేమ్ రీమేక్ చేస్తున్నారు. ఇందీలో కూడా సినిమా ముంబై నేపథ్యంలోనే సాగుతుంది. సౌత్ లో ప్రకాష్ రాజ్ నటించిన స్థానంలో హిందీలో నసీరుద్దీన్ షా నటిస్తున్నారు. జనవరి 13, 2017లో సినిమా విడుదల కాబోతోంది.

English summary
"Saw the trailer of #OkJaanu..An absolute visual treat..Brilliant work as always by Ravi K. Chandran :) All the best sir dop007" Mahesh Babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu