»   » ‘పోకిరి’ స్టైల్ లో ఫినిషింగ్ టచ్ కి ‘దూకుడు’ తగ్గించిన మహేష్ బాబు..

‘పోకిరి’ స్టైల్ లో ఫినిషింగ్ టచ్ కి ‘దూకుడు’ తగ్గించిన మహేష్ బాబు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ప్రిన్స్, కలల రాకుమారుడు, నెంబర్ వన్ హీరో..అంటూ మహేష్ ని మోసేసిన అభిమాన సంద్రం నివ్వెరపోయింది. ఫ్యూచర్ మెగాస్టార్ అంటూ మహేష్ ని ఆకాశానికెత్తేసిన మీడియా సైలెంట్ అయిపోయింది. డిజాస్టర్ టాక్ తోనే పవన్ 'పులి"లా గర్జించేసి కాస్తో కూస్తో రాబడితే..ఏవరేజ్ రిపోర్ట్ తో కూడా ఆ రేంజ్ రెవెన్యూ తీసుకురాలేకపోయిన మహేష్ ఇమేజ్ పై ఇండస్ట్రీలో ఇప్పుడు మొదలయ్యాయి అసలైన చర్చలు..

అవి ఏవిధంగా అంటే బడ్జెట్ విపరీతంగా పెరుగుతూ పోవడమే 'ఖలేజా" పాలిట శాపమైందని కొదరు అంటుంటే మరీ క్లాస్ సినిమా అయిపోవడమే 'ఖలేజా"కి ప్రతికూలాంశం అయిందని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా, ప్లాప్ ని ఆవరేజ్ గా, ఆవరేజ్ ని హిట్ గా హిట్ ని సూపర్ హిట్ గా మార్చడమే మాస్ హీరోల సత్తాకి నిదర్శనమనీ..అదే ఆయా హీరోల స్టార్ ఇమేజ్ కి సాక్షమనీ అంటూ ఆ యాంగిల్ లో మహేష్ వైఫల్యం స్పష్టమయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పటివరకూ 'ఖలేజా"కి వచ్చిన కలెక్షన్ అంతా మహేష్ పుణ్యమేనన్న వాదనలూ వున్నాయి.

మొత్తానికి 'ఖలేజా" రిజల్ట్ వల్ల తన ఇమేజ్ ముందుకో క్వశ్చన్ మార్క్ వచ్చి చేరడంతో ఆ ప్రశ్నార్థకాన్ని ఆశ్చర్యార్థకంగా మార్చే స్థాయిలో తన 'దూకుడు" చూపాల్సిన పరిస్థితి ఏర్సడింది మహేష్ కి అందుకే 'దూకుడు" చిత్రానికి బడ్జెట్ ని, వర్కింగ్ డేస్ ని తగ్గించి ఆ ప్రాజెక్ట్ ని 'పోకిరి" స్టైల్ లో ఫినిష్ చెయ్యాలనీ, బాక్సాఫీస్ లో భారీ లాభాల్ని చూపించాలనీ, డిసైడయ్యారట మహేష్. అందుకే ముప్పై కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో, కేవలం మూడున్నర నెలల వ్యవథిలో 'దూకుడు" ని పూర్తి చేసేందుకై నడుం బిగించింది శ్రీను వైట్ల టీమ్..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu