»   » మీరే పరిశ్రమను గబ్బు పట్టిస్తూ... రివ్యూపై ఏడుస్తారేందుకు?: కత్తి మహేష్

మీరే పరిశ్రమను గబ్బు పట్టిస్తూ... రివ్యూపై ఏడుస్తారేందుకు?: కత్తి మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రివ్యూ రైటర్లను టార్గెట్ చేస్తూ ఇటీవల 'జై లవ కుశ' సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారానికి దారి తీసింది. మీడియాలో రివ్యూ రైటర్స్ వర్సెస్ టాలీవుడ్ అంటూ ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ స్పందించారు.

సినిమా పరిశ్రమలో హీరోలు, అభిమానులు కులం ఆధారంగా డివైడ్ అయ్యారని, కొన్ని సందర్భాల్లో ఒకే ఫ్యామిలీలోని హీరోల అభిమానుల మధ్య కూడా పడటం లేదని గుర్తు చేస్తూ మహేష్ కత్తి ఫేస్ బుక్ పేజీలో ఓ కామెంట్ పెట్టారు.

రెండు వర్గాలను ప్రస్తావిస్తూ

ఒక వర్గం హీరోల సినిమాల్ని మరో వర్గం హీరో ఫ్యాన్స్ చెడ్డ చెయ్యడం. బ్యాడ్ పబిసిటీ చెయ్యడం.....లాంటివి జరుగుతున్నాయంటూ మహేష్ కత్తి అభిప్రాయ పడ్డారు.

ఒకే ఫ్యామిలీలో

ఒకే ఫ్యామిలీలో

ఓ వర్గం హీరోల ఫ్యాన్స్ లొనే ఒక ఫ్యామిలీకి మరో ఫ్యామిలీ హీరో ఫ్యాన్స్ కి పడకపోవడం. ఒకే ఫ్యామిలీ లొనే వివిధ కుటుంబ, రాజకీయ కారణాల వల్ల ఒకరినొకరు తక్కువ చేసుకునేలా క్యాంపెయిన్లు చెయ్యడం... లాంటివి తరచూ చూస్తున్నామని మహేష్ కత్తి అభిప్రాయ పడ్డారు.

సినీ పరిశ్రమను గబ్బు పట్టిస్తున్నారు

సినీ పరిశ్రమను గబ్బు పట్టిస్తున్నారు

ఒక్కొక్కరి చేతిలో కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ చానళ్లు, కొన్ని టివి ఛానళ్లు. మీలో మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ సినిమాలను సినిమా పరిశ్రమను గబ్బు పట్టిస్తూ రివ్యూల మీద పడి ఏడుస్తారేందుకు?.... అంటూ మహేష్ కత్తి ఘాటుగా వ్యాఖ్యానించారు.

వీలయితే మీరే....

వీలయితే మీరే....

"రివ్యూల మీద ఇలాంటి రివ్యూ ఏమిటని, ఎలా రివ్యూ ఇవ్వాలో, మీ రివ్యూలు ఏమిటి స్వామీ! వీలయితే సినిమానే మీరు ఇంకోలా రివ్యూ చేస్తే టైం సేవ్...ఎనర్జీ సేవ్...మీకు. నాకు." అంటూ మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.

స్పైడర్ గురించి మరో పోస్ట్

నిన్న స్పైడర్ విడుదలైన వెంటనే తనదైన విశ్లేషణ చేసిన మహేష్ కత్తి..... తాజాగా మరో పోస్టు పెట్టారు.

English summary
"Super hero who believes in humanity. A super villain who is the manifestation of all the evil in humanity fight to prove themselves. A simple plot. But what makes one work is to make it a universal question of humanity. And other one simply remains a hero Vs Villain story. If we miss basics of story telling. Especially the super hero kind...We simply lose it. Yes, simply lose it." Mahesh Kathi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X