»   » ‘బ్రహ్మోత్సవం’ కాపీ కామెంట్స్...మిక్కీ వివరణ

‘బ్రహ్మోత్సవం’ కాపీ కామెంట్స్...మిక్కీ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. మెన్న జనవరి 1న విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. కేవలం రీలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 5.45 లక్షల వ్యూస్, 11000 లైక్స్ వచ్చాయి. అయితే అదే సమయంలో ఈ టీజర్ లో సాంగ్ కాపీ అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో మీడియాలో గుప్పుమంది.

మిక్కీజే మేయిర్ రూపొందించిన ఈ పాట... Avicii's "Wake me up" ని పోలి ఉండటం అందిరనీ విస్మయపరిచింది. దాంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ విషయంలో ...మహేష్ అభిమానులను నిరాసపడ్డారు. మీరూ ఆ సాంగ్ ని ఇక్కడ చూడండి.అయితే తాను కాపీ కొట్టలేదంటూ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్...సోషల్ నెట్ వర్కింగ్ ఫేస్ బుక్ సాక్షిగా..తెలియచేసారు. ఆయన తనకు కాపీ కొట్టాల్సిన అవసరం లేదని, గిటార్ బీట్స్ ఒకేలా చాలా సార్లు ఉంటాయని అన్నారు. ఆయనేం పోస్ట్ చేసారో ఇక్కడ చూడండి.


To my well wishers and music lovers - the teaser of my upcoming movie released today., and I was pleasantly surprised to...


Posted by Mickey J Meyer on 1 January 2016

ఈ సినిమాను ఏప్రిల్‌ 29న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. వేసవికాలం అయితే పిల్లలకు పరీక్షలు కూడా అయిపోతాయని, ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ టీజర్ లో ఉన్న లిరిక్స్ ఒక్కసారి గమనిస్తే అది ఫ్యామిలి సినిమా అని అర్థమయిపోతుంది. ఆ టీజర్ లో ''వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందాం... ఎందుకు ఆలస్యం...అందరిని రమ్మదాం బంగారు..''. అని సాగే ఈ టీజర్ పై ఓలుక్ వెయ్యండి.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.

English summary
'Brahmotsavam' Movie teaser song composed by Mickey J Meyer in the teaser appears to be similar to that of Avicii's "Wake me up".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu