»   » వేషం ఇప్పిస్తానని పిలిచి...టీవీ ఆర్టిస్టు పై రేప్

వేషం ఇప్పిస్తానని పిలిచి...టీవీ ఆర్టిస్టు పై రేప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : బుల్లితెర నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణపై హెచ్‌.ఎస్‌.ఆర్‌. లేఔట్‌ ఎహసాన్‌(31) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను క్వారీ యాజమానిగా గుర్తించారు. ఆసంఘటనకు సంబంధించి మరో ఇద్దరు దుండగుల్ని త్వరలో అరెస్టు చేస్తామని డీసీపీ రోహిణి సపట్‌ తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి మార్చి27న ముంబయి నుంచి నగరానికి పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బుల్లితెర నటి కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. కేసు దర్యాప్తులో ఉంది.

Main accused in actor's rape case arrested

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ... ఎహసాన్....ఓ డైరక్టర్ లాగ తనను తాను పరిచయం చేసుకుని ఆమెను కలిసాడు. ఆమెకు ప్లైయిట్ టిక్కెట్ లు బుక్ చేసి, హోటల్ రూమ్ కూడా తీసారు. దాంతో ఆమె సిటీకు వచ్చి...రెండు రోజులు ఉండిపోయింది.

నిందుతుడు తన స్నిహితులతో కలిసి ఆమెను రూమ్ కు తీసుకు వెళ్లి...అక్కడ తినటానికి ఆహారం పెట్టి..జ్యూస్ లో ...డ్రగ్స్ కలిపారు. ఆమె జ్యూస్ తాగిన తర్వాత ఆమెను స్పృహ తప్పిపడిపోయింది. దాంతో ఆమెను రేప్ చేసారు.

ఆ తర్వాత రోజు ఆమె మెలుకవ వచ్చాక...ఈ విషయం పోలీసులకు చెప్పితే...ఈ విషయం మొత్తం చిత్రీకరించామని, పబ్లిక్ లో పెడతామని భయపెట్టారు. అయితే ఈ విషయాన్ని ఆమె పోలీసులు వద్దకు తీసుకు వెళ్లింది. వారు అరెస్టు చేసారు.

English summary
Bengaluru South-East division police have arrested the main accused in connection with the recent rape of an actor in Koramangala police station limits.
Please Wait while comments are loading...