»   » బాహుబలి: బిజ్జలదేవగా నాజర్.....(మేకింగ్ వీడియో)

బాహుబలి: బిజ్జలదేవగా నాజర్.....(మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహాభారతంలో శకుని పాత్ర ఎలాంటదో....‘బాహుబలి' సినిమాలో బిజ్జలదేవ పాత్ర అలాంటిది. కౌరవులకు పాండవులపై విషం నూరిపోసిన వ్యక్తి శకుని. ఎత్తుకి పైయెత్తులు వేయడంలో శకునిని మించినవారెవరూ వుండరేమో. అలాంటివారినే శకుని అని అంటుంటాం. కానీ, అంతకు మించి.. బిజ్జలదేవ పాత్ర ‘బాహుబలి'లో వుండబోతోంది. బాహుబలిలో ఈ పాత్రను నాజర్ పోషిస్తున్నాడు.

బిజ్జలదేవ పాత్రకు ఒక చేయి చచ్చుబడిపోయి ఉంటుంది. ఇందు కోసం పత్యేకంగా చేయి తయారు చేసి బిజ్జలదేవ పాత్రను షూట్ చేసారు. తాజాగా పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేసారు.‘బాహుబలి' ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జులై 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కోసం దరఖాస్తు చేసుంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి.


ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ లోగా చిత్రం యూనిట్ సైతం ప్రమోషనల్ ఏక్టివిటీస్ పెంచేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 250 కోట్ల అత్యంత భారీ వ్యయం రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Nasser as BIJJALADEVA

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Making of Baahubali - Nasser as BIJJALADEVA.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu