»   » నాగ్‌ అలాంటివారు కాదు: మమతా మోహన్ దాస్

నాగ్‌ అలాంటివారు కాదు: మమతా మోహన్ దాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచిని గుర్తించి అది బయటికి చెప్పే మంచి మనసు చాలామందికి ఉండదు. కానీ నాగ్‌ అలాంటివారు కాదు. ఎదుటి వ్యక్తులు ఎంత చిన్నవాళ్లయినా వాళ్లల్లో 'మంచి' కనిపిస్తే అభినందిస్తారు అంటూ పొగడ్తలలో ముంచెత్తుతోంది మమతా మోహన్ దాస్. వీరిద్దరు కాంబినేషన్ లో రెడీ అయిన కేడీ చిత్రం ఈ రోజు రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మమతా అద్భుతమైన నటి, చాలా పంక్చువల్‌ అని నాగార్జున అన్నారు. ఈ ప్రశంసలకు మీ స్పందన ఏమిటని అడిగితే ఆమె ఈ విధంగా స్పందించారు. అలాగే వాస్తవానికి ఆయనతో కలిసి 'కింగ్‌'లో నటిస్తున్నప్పుడు నాతోనే ఈ మాటలు చెప్పారు.

నాలో ఉన్న ప్రతిభని, నా పంక్చువాల్టీని అంత పెద్ద హీరో గుర్తించినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున అద్భుతమైన నటుడు. అందుకే ఇతర నటీనటుల్లో ఉన్న ప్రతిభని గుర్తించగలుగుతున్నారాయన అంది. అలాగే 'కేడి' చిత్రంలో తను పోషించిన పాత్ర గురించి చెబుతూ...ఇందులో నా పాత్ర పేరు 'జానకి'. నాది గ్రే షేడ్‌ ఉన్న పాత్ర. జానకి చాలా ధైర్యవంతురాలు. తన మంచి కోసం పోరాడటానికి వెనుకాడదు. జానకి తీసుకునే నిర్ణయాలు చాలా 'టఫ్‌'గా ఉంటాయి. ఇలాంటి పాత్ర నేనిప్పటివరకు చేయలేదు. అందుకని సరికొత్త అనుభూతినిచ్చింది. ప్రేక్షకులు జానకి పాత్రతో తమని తాము పోల్చుకుంటారు. ఈ పాత్ర అంత సహజంగా ఉంటుంది అంటోంది. బెస్ట్ ఆఫ్ లక్ మమతా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu