»   » 'బాహుబలి' సెట్స్ పై పీటర్‌ హెయిన్స్ (వీడియో)

'బాహుబలి' సెట్స్ పై పీటర్‌ హెయిన్స్ (వీడియో)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : 2001లో 'మురారి' ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన స్టంట్‌ మాస్టర్‌ ఇతను. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో హీరోలతో భారీ ఫైట్లు చేయించాడు. ఇప్పుడు 'బాహుబలి' కోసం ప్రభాస్‌, రానా, అనుష్కతో ఫైట్లు చేయిస్తున్నాడు. అతనే వెండితెర పోరాటాల సృష్టికర్త పీటర్‌ హెయిన్స్‌. ఫైట్లతోపాటు ఇతనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఎత్త్తెన కొండలపై నుంచి తాడు సాయంతో దిగడం, అత్యంత చలి ప్రదేశాల్లో జలపాతాలలో ఈత కొట్టడం వంటి ఇష్టాలున్నాయి.

  వీటన్నింటితోపాటు మనోడికున్న మరో ప్రత్యేకత రోజుకో డ్రెస్‌లో కనిపించడం. 'బాహుబలి' సెట్‌కి పీటర్‌ రోజుకోరకం డ్రెస్‌, కేశాలంకరణతో వస్తున్నాడు. ఇవన్నీ చూసిన చిత్రబృందం అభినందనలు తెలియజేస్తూ పీటర్‌ స్త్టెల్‌ బుక్‌ పేరున ఓ వీడియో రూపొందించింది. ఇందులో పీటర్‌ ఇష్టాయిష్టాలు, దుస్తుల ప్రత్యేకతలను వివరించింది. మీరు చూడబోయే వీడియో అదే.

  Man of Action peterhein being Bold @ Baahubali Sets

  రాజమౌళి తన సినిమా హీరోల పుట్టినరోజులకు ఫస్ట్‌లుక్‌తో పలకరించిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 2000 మంది కళాకారులపై చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

  <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/xOMlLh7Aks0?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

  ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

  English summary
  Peter is a very big technician and he is the chosen one for all the fights in top league movies. a tribute video to the fight master Peter Hein. The video focused on Peter’s taste for fashion, his agility and his guts.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more