»   » షాకిచ్చే మోసం: హీరోయిన్‌ ఏజెంట్‌నంటూ.. భారీ ఎత్తున దోచుకుంటున్నాడు

షాకిచ్చే మోసం: హీరోయిన్‌ ఏజెంట్‌నంటూ.. భారీ ఎత్తున దోచుకుంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: హిందీ చిత్ర పరిశ్రమ లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఒక హీరోయిన్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి బోల్తా కొట్టించాడు మోసగాడు. దాంతో మిగతా హీరో,హీరోయిన్స్ కూడా ఎలర్ట్ అయ్యారు. తమ పేరు చెప్పి ఏమన్నా మోసం జరుగుతోందేమో అని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈ మోసానికి గురైంది మహేశ్‌భట్‌ కుమార్తె పూజా భట్‌ .

పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత మహేశ్‌భట్‌ కుమార్తె పూజా భట్‌ వద్ద ఏజెంట్‌గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ ప్రశాంత్‌ మాల్గేవార్‌ అనే వ్యక్తి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నాడు. వెంటనే ఈ విషయం పూజా భట్‌కి తెలీడంతో అప్రమత్తమై ట్విటర్‌ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

Man Posed As Pooja Bhatt’s Agent & Cheated

'సాలిట్యూడ్‌ లైఫ్‌స్టైల్‌ ఐఎన్‌సీకి చెందిన ప్రశాంత్‌ మాల్గేవార్‌ అనే వ్యక్తి నా ఏజెంట్‌నని చెప్పుకుంటూ కంపెనీల నుంచి నిధులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి చాలా కంగారుపడ్డాను.

ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇలాంటి ఫ్రాడ్‌ చేసిన ప్రశాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓ ప్రముఖ ఈవెంట్‌ కంపెనీకి ఓ సాధారణ వ్యక్తి వచ్చి పూజా ఏజెంట్‌నని చెప్పి డబ్బు అడిగితే ఇచ్చేయడమేనా.. కనీసం అది నిజమో కాదో అని చెక్‌ చేసుకోవాల్సిన పనిలేదా? దిల్లీకి చెందిన ఈ ప్రశాంత్‌పై నేను ఇప్పుడే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా' అని ట్వీట్‌ చేశారు పూజ. దీంతో సదరు ఈవెంట్ కంపనీలు ఉలిక్కి పడ్డాయి.

English summary
Pooja Bhatt recently took to Twitter to expose a person named Prashant Malgewar who has been portraying himself as her agent and taking money from event management companies on the behalf of Pooja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu