»   » డ్రగ్స్ కేసు: మంచు లక్ష్మి ట్వీట్ సంచలనం

డ్రగ్స్ కేసు: మంచు లక్ష్మి ట్వీట్ సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ కేసులో నటి మంచు లక్ష్మి ట్వీట్ సంచలనం అయింది. ఆమె ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ ను సమర్ధిస్తూ దిగ్విజయ్‌పై మండి పడింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీటుకు మంచు లక్ష్మి మద్దతు పలికారు. రామ్ (కేటీఆర్) చెప్పినట్టుగానే దిగ్విజయ్ ఎప్పుడో మతి స్థిమితం కోల్పోయారంటూ ట్వీట్ చేసారు.

తెలంగాణలో భారీ డ్రగ్స్ స్కాం జరిగిందని, ఇందులో ఇరుక్కున్న వ్యక్తులకు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నాయని, వారిని ఈ కేసు నుండి కాపాడుతారో? ప్రాసిక్యూట్ చేస్తారో? చూద్దాం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కోవడం, కేటీఆర్‌కు సినీ రంగంలో స్నేహితులు ఉండటంతో ఆయన ఇలాంటి ట్వీట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. దిగ్విజయ్‌కు మంత్రి కేటీఆర్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. మీరు ఎప్పుడో కోల్పోయారు. రాజకీయాల నుంచి రిటైరై, వయసుకు తగ్గ పనులు చేసుకోవాలంటూ కేటీఆర్ సూచించారు.

English summary
Manchu Lakshmi takes on Digvijay. "Say it like it is Ram. 😠 he's lost it a long time ago" She tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu