»   » కెలకద్దు...అల్లాడిపోతావు అంటూ మంచు మనోజ్ సీరియస్ వార్నింగ్

కెలకద్దు...అల్లాడిపోతావు అంటూ మంచు మనోజ్ సీరియస్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. ఎస్‌.కె.సత్య దర్శకుడు. ఈ సందర్భంగా 'గుంటూరోడు' చిత్ర యాక్షన్‌ ట్రైలర్‌ను మనోజ్‌ అభిమానులతో పంచుకున్నారు.

'కన్నాగాడిని కెలికితే దెబ్బ ఎలా ఉంటుందో' ప్రత్యర్థులకు రుచి చూపించేశారు మంచు మనోజ్‌. ఆ దెబ్బ ఎలా కొట్టారో తెలియాలంటే మీరు 'గుంటూరోడు' చిత్రం చూడాల్సిందే. శ్రీవరుణ్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎస్.కే. సత్య అనే ఓ కొత్త డైరెక్టర్ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. మార్చి3న రిలీజ్ కానున్న 'గుంటూరోడు'లో సంపత్ రాజ్ విలన్ పాత్ర పోషించగా.. రాజేంద్ర ప్రసాద్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

నిర్మాత వరుణ్‌ అట్లూరి మాట్లాడుతూ... లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోంది. మనోజ్‌ యా క్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తారు. అనుకున్న విధంగా పూర్తి చేయ గలిగాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది అన్నారు.

Manchu Manoj's Gunturodu telugu Movie Action Trailer

ఇప్పటికే విడుదలైన పాటలు, చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన వస్తోంది. ఇప్పటికే గతంలో రిలీజైన టీజర్, థియేట్రికల్ ట్రైలర్‌కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. మార్చి 3న గుంటూరోడు మూవీతో ద్వారకా, మెట్రో, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలు కూడా పోటీగా రిలీజవుతున్నాయి. డీజే వసంత్‌ స్వరాలు సమకూర్చారు.

గుంటూరోడు చిత్రంలో కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు మెగాస్టార్ చిరంజీవి తన మాస్ స్టైల్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చారని చిత్ర దర్శకుడు సత్య తెలియచేసారు. అనంతరం హీరో మంచు మనోజ్ బాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా వుందని, ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీం అందరి తరుపన స్పెషల్ థాంక్స్ తెలియచేస్తున్నామని తెలిపారు.

మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

సంగీతం: శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్ , కొరియోగ్రాఫర్ : శేఖర్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్, కో- డైరెక్టర్ అర్జున్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్ వైజర్ జి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ, నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : ఎస్.కె సత్య.

English summary
Watch and enjoy Gunturodu Telugu Movie Action Trailer Starring Manchu Manoj and Pragya jaiswal Directed by SK Satya and music by composed
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu