»   » మంచు మనోజ్ ‘రైతు’ ఉద్యమం.... రాజమౌళి, కేటీఆర్, రానా నామినేట్!

మంచు మనోజ్ ‘రైతు’ ఉద్యమం.... రాజమౌళి, కేటీఆర్, రానా నామినేట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా రైతుల కోసం ఏదైనా చేయాలనే కీలకమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'సేవ్ ది ఫార్మర్' ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

రైతుల ఆత్మహత్యలు జరుగకుండా వారిని రక్షించాలనే ఒక మంచి లక్ష్యంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాన్ సమయంలో మొదలు పెట్టిన యునిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సేవ్ ది ఫార్మర్' ఉద్యమం జరుగబోతోంది.

అందరం చేతులు కలుపుదాం

అందరం చేతులు కలుపుదాం

తాను ఒక్కడినేనని, తనకున్నవి రెండు చేతులేనని.... కానీ కొందరి కన్నీటినైనా ఇవి తుడవగలవన్న నమ్మకం తనకుందని మనోజ్ చెప్పుకొచ్చారు. మన అందరి చేతులు కలిస్తే ఎంతో మంది అన్నదాల కన్నీళ్లు తుడవచ్చని.... మనం చేసే ఒక ఆలోచన, ఒక చిన్న సహాయం ఒక చావును ఆపవచ్చు, ఒక కడుపు నింపవచ్చు, ఒక బతుకు చక్కబెట్టొచ్చు...అని మనోజ్ తెలిపారు.

ఒకరోజు ఆదాయం

మన రైతులను కాపాడుకోవడానికి మనం చేయాల్సిందల్లా సంవత్సరంలో ఒకరోజు ఆదాయాన్ని విరాళంగా ఇవ్వడమే. ఆ డబ్బును రైతుల బాగుకోసం యునిటీ సంస్థ ఉపయోగిస్తుందని మంచు మనోజ్ అంటున్నారు.

యూనిటీ గోల్స్

యూనిటీ సంస్థ గోల్స్ ఏమిటో కూడా మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రాజమౌళి, కేటీఆర్, రానా, సాయి ధరమ్ తేజ్, జీవి కేశవ్ నామినేట్

తనవంతుగా మొదట ఐదుగురు వ్యక్తులను మంచు మనోజ్ నామినేట్ చేసారు. అందులో తెలంగాణ మంత్రి కేటీఆర్, దర్శకుడు రాజమౌళి, నటుడు రానా, సాయి ధరమ్ తేజ్, జీవి కేశవ్ ఉన్నారు.

English summary
"I nominate these 5 people & take the #SaveTheFarmer initiative ahead. Tag your friends & donate your salary worth a day. Spread the word." Manchu Manoj tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu