»   » తన తండ్రి మోహాన్ బాబు ముందు సవాల్ చేసిన విష్ణు ఓడిపోయాడా...?

తన తండ్రి మోహాన్ బాబు ముందు సవాల్ చేసిన విష్ణు ఓడిపోయాడా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వస్తాడు నారాజు సినిమాతో ఇంకో ఢీ లాంటి హిట్ కొడతానని ఆశపడ్డ మంచు విష్ణుకి నిరాశే మిగిలింది. సినిమా విషయంలో మంచి రేటు ఇచ్చి ప్రముఖ రివ్యూవర్లనీ, వెబ్ సైట్లనీ మేనేజ్ చేసినా కానీ వస్తాడు నారాజు చిత్రానికి కనీస ఆదరణ కరువైందనేది నిజం. ఇది మాత్రమే కాకుండా ఎన్ని మంచి రేటింగ్స్ ఇచ్చినా సినిమాలో విషయంలో లేకపోతే సినిమాలు ఆడవని మరోసారి రుజువైంది.

ఇది మాత్రమే కాకుండా విడుదలకు ముందు హడావుడి చేసినటువంటి మంచు విష్ణు భార్య వెరోనికా కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. మరోవైపు మంచు విష్ణు తన తండ్రి మోహాన్ బాబుతో సవాల్ చేసిమరీ వస్తాడు నారాజు సినిమాని రూపోందించడం తీరా సినిమా విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకోకపోవడంతో విష్ణు మనసు కూడా గాయపడిందని సమాచారం. దీంతో ఢీ లాంటి హిట్ ఎలాకోట్టాలో అర్దంకాక మంచు విష్ణు ఒక్కసారి డిప్రషన్‌లోకి వెళ్శిపోయారనేది సమాచారం.

ఇకపోతే అస్సలు విషయం ఎక్కడ వచ్చిందంటే తన తమ్ముడు మంచు మనోజ్ మాత్రం తేలికగా డీసెంట్ సినిమాలు తీసుకుంటూ ఆలా సేఫ్ జోన్‌లో ఉండడం, డేంజర్ జోన్‌లో ఉన్నటువంటి మంచు విష్ణుకి మాత్రం ఆ డేంజర్ జోన్‌లో నుండి ఎలా బయటపడాలో అర్దం కావడం లేదు. సినిమా పరాజయం కంటే కూడా మొత్తం తన ఫ్యామిలీ ముందు ఓడిపోవడమే విష్ణుని ఎక్కువ కృంగదీస్తోందని ఫిలిం నగర్‌లో చెప్పుకుంటున్నారు.

English summary
Manchu Vishnu, the star kid of veteran actor Mohan Babu is testing the waters again with 'Vastadu Naa Raju'. Despite a physical height, Vishnu didn't even get a single acting talent from his talented dad. His films are becoming a torture to the audience, as per industry talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu