»   » అఫీషియల్: మణిరత్నం నెక్ట్స్ మూవీ కాంబినేషన్ అదుర్స్

అఫీషియల్: మణిరత్నం నెక్ట్స్ మూవీ కాంబినేషన్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియాలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వారిలో మణిరత్నం ఒకరు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురు చూసే అభిమానులు ఎందరో. ఆయన సినిమాల్లో ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉండటమే అందుకు కారణం.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ మూవీ 'చెలియా' బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. తాజాగా మణిరత్నం తన నెక్ట్స్ మూవీ ప్రకటించారు. టైటిల్ ఇంకా పైనల్ కాలేదు కానీ.... సినిమాలోని ప్రధాన తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు రిలీజ్ చేశారు. సినిమాలో నటీనటుల కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది.

మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగు, తమిళం టైటిల్స్ ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది.

హీరో

హీరో

ఈ సినిమాలో శింబు హీరోగా నటించబోతున్నాడు. ఈ మేరకు నటీనటులకు సంబంధించిన స్కెచ్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి

కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి

మరో తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

అరవింద స్వామి

అరవింద స్వామి

మణిరత్నం ‘రోజా', ‘బొంబాయి' సినిమాలతో పాపులర్ అయిన అరవింద స్వామి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరం అయ్యారు. 2013లో వచ్చిన ‘కడలి' సినిమా ద్వారా మళ్లీ ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మణిరత్నంప్రకటించిన చిత్రంలో కూడా అరవిందస్వామి కీలకమైన పాత్రలో నటించబోతున్నారు.

పహాద్ ఫాజిల్

పహాద్ ఫాజిల్

ఈ చిత్రంలో మలయాళం హీరో పహాద్ ఫాజిల్ కూడా నటించనున్నారు. అయితే ఆయన పాత్ర ఎలా ఉంటుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

జ్యోతిక కూడా...

జ్యోతిక కూడా...

ప్రముఖ నటి, హీరో సూర్య భార్య జ్యోతిక కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయబోతున్నారు.

ఐశ్వర్య రాజేష్

ఐశ్వర్య రాజేష్

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో ఎంపికయింది. అయితే ఆమె ఎవరికి జోడీగా ఉంటుంది అనేది ఇంకా తెలియదు.

సంతోష్ శివన్

సంతోష్ శివన్

ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు.

ఏఆర్ రెహమాన్

ఏఆర్ రెహమాన్

మణిరత్నం సినిమాలు అంటే తప్పకుండా ఏఆర్ రెహమాన్ సంగీతం ఉండాల్సిందే. ఈ సినిమాకు కూడా రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Mani Ratnam Announces His Next. The film is going to be produced by Mani Ratnam himself on Madras Talkies banner. The film will star Tamil heroes Simbhu, Vijay Sethupathi and Aravind Swamy. It also has Malayalam hero Fahad Fassil. The film will feature the female leads Jyothika and Aishwarya Rajesh. Santhosh Shivan will crank the camera for the movie and AR Rahman will score the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu