»   » నిజంగానే ఏడుపొచ్చేసేది: 'మరోచరిత్ర' అనిత

నిజంగానే ఏడుపొచ్చేసేది: 'మరోచరిత్ర' అనిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మరోచరిత్ర' రీమేక్‌ ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతున్న అనిత. ఆమె తన షూటింగ్ అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఆమె మాటల్లోనే....షూటింగ్‌ ఆరంభించిన మొదటి రోజే ఓ ఎమోనల్‌ సీన్‌ తీయడం జరిగింది. ఆ సన్నివేశం కోసం గ్లిజరిన్‌ వాడాను. కళ్లకు గ్లిజరిన్‌ అప్లయ్‌ చేయగానే కన్నీళ్లు జలజలా రాలాయి కానీ నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. ఏడుపు సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఈ అసౌకర్యం తప్పదనుకున్నాను. కానీ ఒక్కోసారి గ్లిజరిన్‌ అవసరం లేకుండానే సహజంగా ఏడుపొచ్చేసేది. సన్నివేశం అంత టచింగ్‌గా ఉండేది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చడం ఖాయం అంటోంది. అలాగే తన కుటుంబం గురించి చెపుతూ....మా అమ్మగారు తెలుగు..నాన్నగారు అమెరికన్‌. నేను యూఎస్‌లో పుట్టాను. అందుకని తెలుగు తెలియదు అంది. అలాగే తాను యూఎస్‌లో చదువుకున్నానని, హీరోయిన్‌ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదుదని చెప్తోంది. 'జర్నలిజం' కోర్సు చేస్తున్నప్పుడు 'మరోచరిత్ర' ఆఫర్‌ వచ్చింది. స్క్రీన్‌ టెస్ట్‌ కోసం ఇండియా వచ్చాను. సెలక్ట్‌ అయ్యాను. షూటింగ్‌ మొదలుపెట్టే వరకు 'ఇది కలా? నిజమా?' అనిపించింది. ఎందుకంటే తొలి అవకాశమే ఇంత మంచిది రావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా..అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక కమల్ హాసన్, సరితల కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టయిన మరో చరిత్ర చిత్రాన్ని వరుణ్ సందేశ్, అనితల కాంబినేషన్ లో రవి యాదవ్‌ దర్శకత్వంలో రీమేక్ చేసారు. 'దిల్‌' రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu