»   » బాగుంది: 'మర్యాద రామన్న' మళయాళ రీమేక్ ట్రైలర్ (వీడియో)

బాగుంది: 'మర్యాద రామన్న' మళయాళ రీమేక్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన చిత్రం మర్యాద రామన్న. ఈ చిత్రం ఇప్పటికే కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయ్యింది. ఇప్పుడు మళయాళిలను సైతం పలకరించటానికి సిద్దపడుతోంది. దిలీప్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఇవాన్ మర్యాద రామన్ టైటిల్ తో రూపొందుతోంది. నిక్కి గాలరాని ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఆ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు చూడండి ఆ ట్రైలర్ ఎలా ఉందో.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఈ చిత్రాన్ని మళయాళంలో సురేష్ దివాకర్ డైరక్ట్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్, కెమెరా వర్క్ విజయ్ ఉలగనాథ్ అందిస్తున్నారు. ఒరిజినల్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ రీమేక్ తెరకెక్కిందని చెప్తున్నారు. దిలీప్ ఆల్రెడీ అక్కడ పేరున్న కామెడీ హీరో కాబట్టి ఖచ్చితంగా మంచి విజయం సాధించే అవకాసం ఉంది. ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల అవుతుంది.


మర్యాద రామన్న చిత్రం కథ ఒక్కసారి గుర్తు చేసుకుంటే..


Maryada Ramanna Malayalam Remake Trailer

హైదరాబాద్ లో నానా కష్టాలుపడుతూ జీవితాన్ని లాక్కొస్తున్న అనాధ రాము(సునీల్). అతనికి ఆశాకిరణంలా ఓ రోజు చిన్నప్పుడే వదిలేసిన తన సొంత ప్రాతం రాయలసీమ నుంచి ఓ ఉత్తరం వస్తుంది. ఆ గ్రామంలో ఉన్న వారసత్వపు పొలాన్ని స్వాధీనం చేసుకోమని ఆ లెటర్ లో ఉంటుంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాము ఆ ఊరుకి గాల్లో తేలుకుంటూ బయిలుదేరతాడు. రాముకి ప్రయాణంలో అపర్ణ(సలోని)అనే అందాల అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెతో ఓ పాట పాడుకుని తన ఊరు వెళ్ళిన రాముకి ఆ ఊరి పెద్ద రామనీడు(నాగినీడు)ఆతిధ్యమిస్తాడు.


ఆ క్రమంలో వాళ్ళతో వారి ఇంటకి వెల్ళిన రాముకి రామనీడు తను ఇష్టపడ్డ అమ్మాయి అపర్ణ తండ్రి అని తెలిస్తుంది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవకుండా వెంటనే మరో విషయం బయిటపడుతుంది. అది వేరేదో కాదు..రామనీడు చిరకాల ప్రత్యర్ధి కొడుకే రాము. ఇది తెలిసిన వెంటనే రామనీడు, అతని కొడుకులు వెంటనే రాముని చంపేయాలనుకుంటారు. అయితే తమ ఆచారం ప్రకారం ఇంటిలో చంపకూడదని,గుమ్మం దాటి బయిటకు అడుగుపెట్టిన వెంటనే చంపేయాలని రెడీ అవుతారు. విషయం తెలుసుకున్న రాము ఇల్లు గుమ్మం దాటి బయిటకు వెళ్ల కూడదనుకుని నిర్ణయించుకుంటాడు. ఈ విపత్కర పరిస్ధితుల్లో ఇరుకున్న రాము అక్కడనుంచి ఎలా బయిటపడి తన ప్రాణాలు కాపాడుకుని,తను ఇష్టపడ్డ అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేది మిగతా కథ.

English summary
The theatrical trailer of 'Ivan Maryadaraman' which happens to be the Malayalam remake of Tollywood superhit 'Maryada Ramanna' directed by SS Rajamouli has been unveiled.
Please Wait while comments are loading...