Just In
- 21 min ago
బాలయ్య-వినాయక్ మళ్లీ మొదటికి.. ఆ చిత్రాన్ని మించి..నిర్మాత అతడే
- 40 min ago
రోజా ఓకే చెప్పింది.. బాలయ్య కష్టాలు షురూ.. బోయపాటి స్కెచ్ వర్కవుట్ కాలేదా?
- 1 hr ago
కమల్ హాసన్ పోస్టర్స్‌పై పేడ కొట్టిన లారెన్స్.. లోక నాయకుడి ఫ్యాన్స్ ఫైర్
- 1 hr ago
'అల.. వైకుంఠపురములో': పోటీ పడదామనుకున్న అల్లు అర్జున్.. చివరకు వెనకడుగు.. కొత్త డేట్ ఫిక్స్
Don't Miss!
- News
చిన్నారులతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తున్న వారిపై తమిళ పోలీసుల కొరడా
- Sports
వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!
- Lifestyle
డయాబెటిస్ మరియు జుట్టు రాలడం: డయాబెటిస్ వల్ల పురుషులకు జుట్టు రాలవచ్చు, బట్టతల రావచ్చు ఎలాగో తెలుసా?
- Technology
డౌన్లోడ్ విభాగంలో దుమ్ము రేపుతున్న కాల్ ఆఫ్ డ్యూటీ
- Finance
పీఎం కిసాన్ స్కీం నిధులు కావాలంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే
- Automobiles
హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వాట్ ఎ చేంజ్, మాస్టర్ భరత్ న్యూ లుక్ చూశారా.. షాక్‌లో హీరోయిన్, అల్లు శిరీష్‌కు ఫ్రెండ్‌గా!

చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రభావం చూపి ఆ తరువాత హీరోలుగా, హీరోయిన్లుగా, క్యరెక్టర్ ఆర్టిస్టులుగా రాణించిన నటులు ఎందరో ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అద్భుతమైన హాస్యాన్ని పండించిన మాస్టర్ భరత్ సినీ అభిమానులందరికి గుర్తుండే ఉంటాడు. పలు తెలుగు చిత్రాల్లో మాస్టర్ భరత్ నటించి మెప్పించాడు. మాస్టర్ భరత్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మాస్టర్ భరత్ మరో మారు తెలుగు తెరపైకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయాడు. అతడి ఎలాంటి పాత్రతో రాబోతున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

షాకిస్తున్న మాస్టర్ భరత్ న్యూ లుక్
చైల్డ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సమయంలో భరత్ బొద్దుగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నూనూగు మీసాల యువకుడిగా స్టైలిష్ గా మారిపోయాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అతడి న్యూ లుక్ చూస్తే షాక్ కావలసిందే.

మాస్టర్ భరత్ నటించిన చిత్రాలు
పోకిరి, వెంకీ, రెడీ, మిస్టర్ పర్ఫెక్ట్, రగడ, నమో వేంకటేశ వంటి విజయవంతమైన చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా భరత్ నటించాడు. కొంత కాలంగా భరత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
|
హీరోకి ఫ్రెండ్ అయిపోయాడు
చైల్డ్ ఆర్టిస్టుగా హాస్యం పాడించిన భరత్ ఓ హీరోకి ఫ్రెండ్ గా నటించబోతున్నాడు. అల్లు శిరీష్ ప్రస్తుతం ఎబిసిడి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శిరీష్ కు భరత్ ఫ్రెండ్ గా పూర్తి స్థాయి పాత్రలో నటించనుండడం విశేషం. ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు.
|
షాక్ లో ప్రియమణి
అల్లు శిరీష్ తన ట్విట్టర్ లో భరత్ న్యూ ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూసిన ప్రియమణి ఆశ్చర్యపోయింది. ఎంతగా మారిపోయాడో ఈ అబ్బాయి అని ట్విట్టర్ లో తెలిపింది. చైల్డ్ ఆర్టిస్టుగా రగడ చిత్రంలో నాతో కలసి నటించాడు. ఆ సమయాన్ని మరచిపోలేను. నా శుభాకాంక్షలని అతడికి చేరవేయి అని ప్రియమణి అల్లు శిరీష్ ని కోరింది.